నేను సాయం చేస్తున్నా.. నాకు పబ్లిసిటీ వద్దు: ధనుష్ కామెంట్స్ వైరల్?

Dhanush Help To Choreographer Shiva Shankar Master

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ ల్లోని  ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే రోజురోజుకు ఈయనకు ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

 Dhanush Help To Choreographer Shiva Shankar Master-TeluguStop.com

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చేత వెంటనే సోను సూద్ స్పందించారు.

ఎలాంటి పరిస్థితిలోనైనా మాస్టర్ ప్రాణాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని ఆ కుటుంబానికి అండగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

 Dhanush Help To Choreographer Shiva Shankar Master-నేను సాయం చేస్తున్నా.. నాకు పబ్లిసిటీ వద్దు: ధనుష్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమిళ స్టార్ హీరో ధనుష్ మాస్టర్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Dance Master, Dhanush, Healp, Shivashanker-Movie

తాజాగా ఈ విషయం గురించి ధనుష్ మాట్లాడుతూ తను సహాయం చేసిన విషయం గురించి పబ్లిసిటీ చేయొద్దని నేను చేస్తున్న సహాయం పబ్లిసిటీ కావడం నాకు నచ్చదు అంటూ కామెంట్లు చేశారు.ధనుష్ ఈ విధంగా చెప్పడంతో ఆయన మంచితనం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అదేవిధంగా కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ తెలుగు తమిళ చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేశారు.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో తమిళం ,బాలీవుడ్ నటులు స్పందిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదంటూ పలువురు టాలీవుడ్ హీరో ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Dhanush #Healp #Master #ShivaShanker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube