తమిళనాడు రియల్ పాలిటిక్స్ పై ధనుష్ సినిమా..?

తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.స్టార్ హీరోగా నిలిచాడు.

 Dhanush Film On Tamil Nadu Real Politics-TeluguStop.com

ఇక ఆయన పాడే పాటలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.తమిళంలోనే కాకుండా తెలుగులోని కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ధనుష్.

ఇప్పటివరకు తెలుగులో నటించని ధనుష్ డబ్బింగ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం మరో సినిమాలో బిజీగా ఉండగా ఆ సినిమా రియల్ పాలిటిక్స్ పై తెరకెక్కనుందట.

 Dhanush Film On Tamil Nadu Real Politics-తమిళనాడు రియల్ పాలిటిక్స్ పై ధనుష్ సినిమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ డైరెక్టర్, ప్రముఖ నిర్మాత శేఖర్ కమ్ముల, ధనుష్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక ఈ సినిమాను మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు.

ఇక ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంచుకున్నట్లు తెలిసింది.అంతే కాకుండా హీరో వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది.

పైగా ఈ సినిమా కోసం సాయి పల్లవి కి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.ఇదంతా ఇలా ఉంటే శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఏ కథ నేపథ్యంలో తెరకెక్కుతుందని వార్తలు వినిపించగా తాజాగా ఈ సినిమా తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుందని ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ముందుకు రానుందని తెలుస్తుంది.మొత్తానికి ఈ సినిమా మంచి క్రేజ్ ఉన్న పొలిటికల్ టచ్ తో రూపొందుతుందని తెలియగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Hero Dhanush, Politics, Shekar Kammula, Tamil Nadu-Movie

ఇదివరకే శేఖర్ కమ్ముల తన దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో లీడర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో స్టార్ హీరో రానా నటించగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో నిలిచింది.ఇక మళ్ళీ హీరో ధనుష్ తో పొలిటికల్ నేపథ్యంలో దర్శకత్వం వహించనుండగా తెలుగులో తొలిసారి పరిచయంతోనే ధనుష్ కు మంచి పాత్ర అందించినట్లు అర్థమవుతుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

#Shekar Kammula #Tamil Nadu #Politics #Hero Dhanush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు