మహేష్‌ బాబుకు చెప్పిన కథతో ధనుష్‌, కమ్ముల మూవీ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా శేఖర్‌ కమ్ముల సినిమా రూపొందాల్సి ఉంది.కొన్ని సంవత్సరాల క్రితం మహేష్‌ బాబు కు శేఖర్‌ కమ్ముల కథను చెప్పారు.

 Dhanu And Shekhar Kammula Movie Story-TeluguStop.com

ఫిదా సినిమా కంటే ముందే ఈ కథను ఆయన తయారు చేశారని సమాచారం.ధనుష్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.

మహేష్‌ బాబు ఇమేజ్ కు ఆ కథ సెట్‌ అవ్వదని ఆ సమయం లో అంతా భావించారు.మహేష్‌ బాబు కూడా కథ బాగుందని అన్నాడట.

 Dhanu And Shekhar Kammula Movie Story-మహేష్‌ బాబుకు చెప్పిన కథతో ధనుష్‌, కమ్ముల మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని సినిమా ను తాను చేయలేను.ఒక వేళ చేసినా కూడా అది వర్కౌట్‌ అవ్వదని తేల్చి చెప్పాడట.

నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు మంచి కథ ఉన్న సినిమా అవార్డు దక్కించుకునే రేంజ్ లో నటించే అవకాశం ఉందట.కాని మహేష్‌ బాబు మాత్రం తన ఇమేజ్‌ కు పూర్తి విభిన్నమైన పాత్ర అవ్వడంతో నో చెప్పాడని తెలుస్తోంది.

ఇప్పుడు ధనుష్ తో శేఖర్‌ కమ్ముల ఆ సినిమా చేయబోతున్నాడు అంటే కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.మన తెలుగు హీరోలు ఎవరు కూడా అలాంటి నేపథ్యం ను కాని కథ ను కాని అంగీకరించే అవకాశం లేదు.

ప్రయోగాలు చేయాలన్నా మరేం చేయాలన్నా కూడా అది ఖచ్చితంగా ధనుష్‌ వల్లే సాధ్యం అవుతుంది.అద్బుతమైన సినిమా లతో పాటు విలక్షణ పాత్రలు చేసిన ఘనత ఆయనకు సొంతం.

Telugu Dhanush, Kollywood, Love Story, Mahesh Babu, Shekhar Kammula, Shekhar Kammula Dhanush, Tollywood-Movie

అందుకే శేఖర్‌ కమ్ముల సినిమా అంటే మరో రేంజ్‌ లో ఉంటుందనే నమ్మకం ను అంతా వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మహేష్‌ బాబు సినిమా లు అంటే ప్రేక్షకులు మస్త్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఆశిస్తారు.కాని ఈ కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఛాన్స్‌ లేదు.అందుకే ధనుష్‌ ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

#Kollywood #Dhanush #ShekharKammula #Shekhar Kammula #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు