సెన్సార్ లో ’పనిలేని పులిరాజు‘
ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ’పనిలేని పులిరాజు‘ చిత్రానికి దర్శకుడు చాచా.పాలేపు మీడియా పై.
లి పతాకంపై పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత పి.వి.నాగేష్ కుమార్ మాట్లాడుతూ ’ధన్ రాజ్ సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది.ఫుల్ లెన్త్ కామెడీతో ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.ప్రాచీ సిన్హా తో పాటు మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.రఘుబాబు, ధన్ రాజ్ కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది‘ అన్నారు.
చిత్ర సమర్పకురాలు పి.లక్ష్మి మాట్లాడుతూ
’ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అన్నారు.
సహ నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ
’వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలుంటాయి.త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
ఇందులో ధన్ రాజ్ 13 పాత్రలు పోషిస్తున్నారు.అన్ని పాత్రలు నవ్విస్తాయి.చిత్రాన్ని మార్చి రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అన్నారు.
దర్శకుడు చాచా మాట్లాడుతూ
’ పులిరాజుల వంశంపై వస్తున్న ఈ చిత్రంలో కామెడీతో కూడిన చిన్న సందేశం వుంటుంది‘ అన్నారు.
శ్వేతా వర్మ ఇషా హరిణి సీమ సరితా కోట కొండవలస కోటేశ్వరరావు సుబ్బారావ్ డి.వి శక్తిమాన్ అప్పారావ్ వెంకీ
తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా:
ఆనంద్ మరుకుర్తి,
సంగీతం:
వి.వి.
పాటలు:
బాలాజీ, కరుణాకర్, లక్ష్మీ నరసింహా, చాచా,
డాన్స్:
నిక్సన్, కళాధర్, రామారావు,
మూల కథ – సహ నిర్మాత:
రవి.కె.పున్నం,
నిర్మాత:
పి.వి.నాగేష్ కుమార్,
స్రీన్ ప్లే, దర్శకత్వం:
చాచా
.