దీపావళికి ముందొచ్చే 'ధనత్రయోదశి' ఎప్పుడో తెలుసా.? ఆ రోజు ఈ 9 వస్తువుల్లో ఏదో ఒకటి కొంటే ఏమవుతుందంటే.?   DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money     2018-10-28   09:54:56  IST  Sainath G

ఎప్పటిలాగే ఈ సారి కూడా దీపావళి వస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ పండుగను జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే పటాకులు కొనడం, స్వీట్లు చేసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ధంతేరస్‌ గురించి మీకు తెలుసా..? దీన్ని చాలా మంది జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబర్ 5 న ధనత్రయోదశి. ఇక ఈ రోజున కింద చెప్పిన వస్తువులను కొనండి. దీంతో మీరు అనుకున్నది నెరవేరుతుంది. లక్‌ కలసి వస్తుంది. ధనం, ఆరోగ్యం లభిస్తాయి. మరి ధంతేరస్‌ రోజున కొనాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వెండి, ఇత్తడి
ధంతేరస్‌ రోజున వెండి లేదా ఇత్తడితో చేసిన వస్తువులను కొనండి. అనంతరం వాటిని మీ ఇంట్లో తూర్పు దిక్కున ఉంచండి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

2. చీపురు
ధంతేరస్‌ రోజున చీపురును కొని తెచ్చుకోండి. దీంతో మీ ఆర్థిక సమస్యలు పోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

3. ఎలక్ట్రానిక్‌ వస్తువులు
ఫ్రిజ్‌, టీవీ, ఏసీ, ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనండి. వీటిని వాయువ్య దిశలో పెట్టండి. శుభం జరుగుతుంది.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

4. వ్యాపారులు
వ్యాపారం చేసే వారు ఓ రిజస్టర్‌ బుక్‌ను కొని దాన్ని తమ కార్యాలయంలో పశ్చిమ దిశలో పెట్టాలి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

5. వృత్తికి సంబంధించినది
ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా ధంతేరస్‌ రోజున తమ వృత్తికి చెందిన ఏదో ఒక వస్తువును కొనండి. దీంతో అందులో మీరు రాణిస్తారు.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

6. గోమతి చక్ర
గోమతి చక్ర అని పిలవబడే గవ్వలు మనకు దొరుకుతాయి. వాటిని ధంతేరస్‌ రోజున కొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి లాకర్‌లో పెట్టాలి. దీంతో అనుకున్నది నెరవేరుతుంది.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

7. బంగారు కాయిన్‌ లేదా లక్ష్మీ ఫొటో
ధంతేరస్‌ రోజున బంగారు కాయిన్‌ లేదా, లక్ష్మీ దేవి, వినాయకుడు ఉన్న ఫొటోను కొని ఇంటికి తెచ్చుకోండి. దీంతో సకల శుభాలు కలుగుతాయి.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

8. స్వస్తిక్‌
ఇంటి గుమ్మం లేదా గేటు ఎదుట స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓ బోర్డును ధంతేరస్‌ రోజున ఏర్పాటు చేయండి. లక్‌ కలసి వస్తుంది.

DhanaTrayodashi Buying These Things On Trayodasi Will Bring You Money-

9. సమయం
ధంతేరస్‌ రోజున బంగారం కొనేవారు ఉదయం సూర్యోదయం జరిగిన తరువాత నుంచి సాయంత్రం సూర్యాస్తమయం జరిగే మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనండి. అదృష్టం కలసి వస్తుంది.