వారిని అదిరింది కి తీసుకొచ్చింది నాగబాబే అంటగా....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో ఒకటి అయినటువంటి జీ తెలుగు చానల్ లో ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే “అదిరింది” షో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.అంతేగాక ఈ షోకి సంబంధించినటువంటి స్కిట్లు కూడా యూట్యూబ్ లో బాగానే ట్రెండింగ్ అవుతున్నాయి.

 Dhan Raj Comments On Mega Brother Nagababu-TeluguStop.com

అయితే తాజాగా ఈ షోలో ప్రముఖ కమెడియన్ గా పని చేస్తున్నటువంటి దన్ రాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తాను అదిరింది కామెడీ షో కి ఎలా వచ్చాననే పలు విషయాలు గురించి ప్రేక్షకులకు తెలిపాడు.

అయితే మొదట్లో తాను కమెడియన్ గా ఈటీవీ ఛానెల్ లో  ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షోలో నటించానని ఈ విషయం అందరికీ తెలిసిందేనని అన్నాడు.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తాను జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నానని ఆ తరువాత ఉన్నట్లుండి ఒకరోజు మెగా బ్రదర్ నాగబాబు నుంచి తనకు కాల్ వచ్చిందని దాంతో ఏమి ఆలోచించకుండా అదిరింది షోలో నటించడానికి ఓకే చెప్పానని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ప్రస్తుతం ఈ రోజు ఇలాంటి పొజిషన్ లో ఉన్నామంటే అందుకే కారణం నాగబాబు అని తెలిపాడు.

Telugu Dhan Raj, Dhanraj-Movie

అయితే ప్రస్తుతం దన్ రాజ్ ఒక పక్క పలు కామెడీ షోలో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా కామెడీ పాత్రలు చేస్తున్నాడు.ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో దన్ రాజ్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఏదేమైనప్పటికీ జబర్దస్త్ కామెడీ షో నుంచి పలువురు కమెడియన్లు ఇవాళ మంచి స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం జబర్దస్త్ కామెడీ షో ఒక కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube