Ravi Teja Dhamaka : మాస్ రాజా కెరీర్ కు కీలకంగా మారిన 'ధమాకా'.. మరి గట్టెక్కేనా?

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకునే వారు.కానీ ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.

 Dhamaka Is The Key To Mass Raja Ravi Teja, Ravi Teja, Dhamaka Movie, Sreeleela,-TeluguStop.com

ఒక్క సూపర్ హిట్ వస్తే.ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి.

ఇతడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.తాజాగా మరొక సినిమా రిలీజ్ కు రెడీ చేసారు.
ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.ఇక ఇప్పుడు ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు.

డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీంతో మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి.క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ వచ్చాడు అనుకుంటే మళ్ళీ వరుస ప్లాప్స్ నే వస్తున్నాయి.

తాజా పరిస్థితులను చూస్తుంటే మరోసారి మాస్ రాజా డేంజర్ లో పడ్డారా? లేకపోతే ధమాకా తో సక్సెస్ అందుకుంటాడా? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Telugu Dhamaka, Trinadharao, Ravi Teja, Sreeleela-Movie

ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.త్రినాథరావు కూడా ఇంత వరకు ప్లాప్ ఎదుర్కోలేదు కాబట్టి ఈ సినిమా కూడా సేఫ్ జోన్ లోనే ఉంటుంది అని చెప్పవచ్చు.మరి ఈ సినిమా హిట్ అయితేనే రవితేజ కెరీర్ కూడా గాడిలో పడుతుంది.

చూడాలి రవితేజ ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడో లేదో.

ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

అలాగే రవితేజ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube