`వీనస్ ఎంటర్‌టైనర్స్` సహకారంతో చిత్ర నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్న ధ‌క్షిణ భాత‌ర అగ్ర ఆడియో సంస్థ `లహరి మ్యూజిక్`

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ ‘లహరి మ్యూజిక్’ చలనచిత్ర నిర్మాణంలోకి ప్ర‌వేశిస్తుంది.‘లహరి ఫిలిమ్స్ LLP’తోపేరుతో “వీనస్ ఎంటర్‌టైనర్స్‌తో క‌లిసి నిర్మిస్తున్న‌ట్లు ప్రకటించింది.పాన్-ఇండియా న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన ఉపేంద్ర స‌హ‌కారంతో రూపొందించ‌నుంది.

 Dhakshina Bhatra's Top Audio Company Lahari Music Is Entering The Film Industry-TeluguStop.com

దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద, బెంగుళూరు ఆధారిత మ్యూజిక్ సంస్థ‌ “లహరి మ్యూజిక్” “లహరి ఫిలింస్ LLP” బ్యానర్‌లో “వీనస్ ఎంటర్‌టైనర్స్” సహకారంతో చలన చిత్ర నిర్మాణం లోకి అడుగు పెట్టింది.

గతంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన “ష్”, “ఎ”, “ ?” వంటి అసాధారణ చిత్ర టైటిల్‌ల గురించి అంద‌రికీ తెలిసిందే.ఆయా సినిమాల‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఉపేంద్ర‌.

అవి దక్షిణాన కల్ట్ క్లాసికల్ మెగా హిట్స్‌గా నిలీచాయి.ఇప్పుడు కన్నడ, హిందీ, తెలుగు, తమిళం వంటి నాలుగు భాషలలో గొప్ప కంటెంట్‌తో ఈ పాన్-ఇండియా చిత్రం ద్వారా మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించడానికి వారు మొదటిసారి చేతులు కలిపారు.

బాహుబలి, KGF, ఇటీవలి విజయం సాధించిన పుష్ప త‌ర‌హాలోనే ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ఇది త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.

లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి .మనోహరన్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా సంగీత ప్రియుల కోసం పనిచేసిన తర్వాత మేము ఈ అసోసియేషన్ కోసం ఎదురు చూశాం.లహరి సంస్థ ఉపేంద్ర‌ తొలి చిత్రం “A” నుండి మ‌ద్ద‌తు ఇస్తోంది.

ఆ సినిమా దక్షిణాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.  90వ దశకం చివరిలో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచింది.

ప్ర‌పంచ‌ ప్రేక్ష‌కుల దృష్టి ఆక‌ర్షించిన ఆయ‌న చిత్రాలను మేము ఆస్వాదించాం.ఇప్పుడు భారతదేశం, విదేశాలలో మొత్తం భారతీయ ప్రేక్షకులు అతని సినిమాలను ఆస్వాదించాల‌ని కోరుకుంటున్నాము.

‘టగరు’, ‘సలగ’ వంటి విజయవంతమైన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మాణ సంస్థగా అందించిన తర్వాత గత రెండు దశాబ్దాల్లో ఉపేంద్ర‌తో కలిసి వివిధ స్థాయిల్లో వివిధ ప్రాజెక్టుల్లో పనిచేశాం అని` వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ ప్రొప్రైటర్‌ శ్రీకాంత్‌ కెపి తెలిపారు.దూరదృష్టితో కూడిన చిత్రాల్లో ప‌నిచేసే `ఉపేంద్ర‌ జీ`తో క‌లిసి ప‌నిచేయ‌డం మాకూ ఆనందంగా వుంది.

దేశం మొత్తం ఈ కొత్త పాన్ ఇండియా విజన్‌ని ఇష్ట పడుతుందని నేను భావిస్తున్నాన‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నటుడు, దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ పాన్-ఇండియన్ చిత్రానికి ప‌నిచేయ‌డానికి నేను చాలా ఉత్సాహంగా వున్నాను.భారీ సంస్థ‌ల నిర్మాణంలో క్రేజ్ క‌లిగించే ఈ సినిమా మొత్తం భారతీయ ప్రేక్షకులు ఇష్టపడతారని నేను ఖచ్చితంగా న‌మ్ముతున్నాను.33 ఏళ్లుగా “ఉపేంద్ర” కథను సృష్టించినా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసిన అభిమానులే కార‌కులు.వారి ఈలలు క‌ర‌తాళాలు న‌న్ను దర్శకత్వం వ‌హించేలా చేశాయి.  అందుకే ఈ చిత్రాన్ని భారతీయ సినీ అభిమానులకు `ప్రజా ప్రభు`గా అంకితం చేస్తున్నాను అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube