జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల హస్తం! చర్యలు తీసుకున్న డీజీపీ  

జయరాం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులని సస్పెండ్ చేసిన డీజీపీ. .

Dgp Suspend Three Police Officers On Jayaram Murder-

పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డి ప్రమేయాన్ని ఇప్పటికే నిర్ధారించిన పోలీసుల ఈ కేసుపై మరింత లోతుగా విచారించి బలమైన సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు. జయరాం హత్యలో ప్రమేయం ఉందన్న అనుమానాలతో చాలా మందిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. ఇక ఇందులో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న శిఖా చౌదరిని కూడా విచారించిన పోలీసులు ఆమె ప్రమేయం లేదని తేల్చి చెప్పేశారు..

జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల హస్తం! చర్యలు తీసుకున్న డీజీపీ-DGP Suspend Three Police Officers On Jayaram Murder

అయితే జయరాం భార్య మాత్రం శిఖా హస్తం ఉందని ఇప్పటికి బలంగా చెబుతుంది.

ఇదిలా ఉంటే మరో వైపు ఈ కేసులో నీరుగార్చే ప్రయత్నం చేసారని, రాకేశ్ రెడ్డి హత్య జయరాంని హత్య చేసినట్లు తెలిసి కూడా ఆధారాలు మాయం చేయడానికి సలహాలు ఇచ్చారని ముగ్గురు పోలీసులపై ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విచారణలో భాగంగా వారిని కూడా విచారించారు.

ఇందులో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రాంబాబులని విచారించిన తర్వాత కొన్ని వాస్తవాలని పోలీసులు రాబట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఈ కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జయరాం హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.