ఐదు భాషలలో జనవరి 28న భారీగా థియేటర్లలో 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) విడుదల..

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు.

 ఐదు భాషలలో జనవరి 28న భారీగా థియ�-TeluguStop.com

నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది.తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు బాషలలో ఈ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు నట్టి కుమార్, నిర్మాత నట్టి క్రాంతి తెలిపారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల టిక్కెట్ల రేట్లు పెంచిన నేపథ్యంలో చిన్న సినిమాలకు తగ్గట్టుగా టిక్కెట్ల రేట్లు ఉంటేనే తన సినిమాలను తెలంగాణాలో విడుదల చేస్తానని ప్రకటించానని,.ఆ తర్వాత చిన్న సినిమాలకు అనుకూలంగా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, తెలంగాణలో తన సినిమాలను విడుదల చేయబోతున్నట్లు నట్టి కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కాగా చిన్న సినిమాలకు అనుకూలంగా టిక్కెట్ల ధరలు ఉండేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు చొరవ చూపిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యవర్గానికి, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు దర్శకుడు నట్టి కుమార్, నిర్మాత నట్టి క్రాంతి పేర్కొన్నారు.

Telugu Dsj, Natti Karuna, January, Lady, Tollywood-Movie

ఇక ఈ చిత్ర కధాంశం గురించి దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, ‘ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని హారర్ నేపథ్యంలో చాలా వినూత్నంగా చూపిస్తున్నాం.వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం.

అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది’ అని అన్నారు.

Telugu Dsj, Natti Karuna, January, Lady, Tollywood-Movie

హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది.హీరోయిన్ గా పరిచయమవుతున్న నాకు తొలి చిత్రంలోనే విభిన్న కోణాలలో నటించే పాత్ర లభించింది.నటిగా నాకు పేరుతెచ్చే పాత్ర ఇది.అలాగే మా నాన్న డైరెక్షన్ లో హీరోయిన్ గా పరిచయం కావడం కూడా మరింత ఆనందంగా వుంది.అంచనాలకు తగ్గట్టు చిత్రం చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.

నట్టి కరుణ హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సుపర్ణ మలాకర్, బాబూమోహన్, హేమంత్, స్నిగ్ధ తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube