దేవుని దగ్గర కోరుకొనే కోరికను బయటకు చెప్పకూడదు....ఎందుకో తెలుసా?  

సాధారణంగా ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లిన,ఇంటిలో పూజ చేసుకున్న ఎదో ఒక కోరిక కోరుకోవటం సాధారణమే. ఆ కోరిక పెద్దది అయినా చిన్నది అయినా సరే బయటకు చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఆలా బయటకు ఎందుకు చెప్పకూడదో అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. దేవుణ్ణి మనం కోరిక కోరుకున్నాం అంటే అది మనకు సాధ్యం కానిదే అయ్యింటుంది.

అలాంటి కోరికను భగవంతుడు తీరిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఒకవేళ మనం కోరుకున్న కోరికను బయటకు చెప్పితే విన్నవారు బయటకు ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఆ కోరిక నెరవేరకూడదని అనుకుంటారు. ఆ కోరిక మనకు తీరకుండా ఉండటానికి మానవ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మన పెద్దవారు ఏ ఆచారం పెట్టిన బాగా అలోచించి మాత్రమే పెడతారు. మన పెద్దవారు పెట్టే ఆచారాలు అన్నిటిలోను పరమార్ధం ఉంటుంది.

Devuni Daggara Korina Korikalu Bayata Cheppakudhadhu Endhuo Telusa-God Telugu Bhakthi

Devuni Daggara Korina Korikalu Bayata Cheppakudhadhu Endhuo Telusa

ఆయితే గుడికి వెళ్ళినప్పుడు తీర్ధం నిల్చుని మాత్రమే తీసుకోవాలి. అదే ఇంటిలో అయితే కూర్చుని తీసుకోవచ్చు. చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటారు. ఆలా చేయటం తప్పు. గుడికి వెళ్లిన వెంటనే స్వామిని తనివితీరా చూసి ఆ తర్వాత మాత్రమే కళ్ళు మూసుకొని మన మనస్సులోని కోరికలను దేవునికి నివేదించాలి.