గణనీయంగా తగ్గిన తిరుమల శ్రీవారి భక్తుల సంఖ్య.. !

కలియుగ వైకుంఠ ధామంగా పిలవబడే ఆలయం తిరుమల ఆలయం అన్న విషయం తెలిసిందే.ఒకప్పుడైతే శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక్కో సారి మూడు రోజులు కూడా పట్టేది.

 Devotees To Thirumala Temple Significantly Reduced Due To Corona Effect, Thiruma-TeluguStop.com

కానీ నేడు కోవిడ్ మూలంగా ఇక్కడి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అసలే దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా ఉండటంతో, అన్ని ఆలయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తిరుమలలో కూడా కోవిడ్ నిబంధనలు అమలవుతున్న నేపధ్యంలో, ప్రజల్లో నెలకొన్న భయం వల్లనో తెలియదు గానీ తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడిస్తున్నారు.

తాజాగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ మళ్లీ భక్తుల సంఖ్య పడిపోయింది.

ఎంతలా అంటే.నిన్న మంగళవారం కేవలం 11,490 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకోవడం విశేషం.

కాగా 5,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా,.హుండీ ద్వారా స్వామివారికి రూ.1.30 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube