తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. ఎన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

సాధారణంగా చెప్పాలంటే కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

కానీ బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

సర్వ దర్శనం క్యూ లైన్ లో భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.

ఉదయం ఏడు గంటలకు సర్వ దర్శనం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనం 16 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారిని దర్శించుకునే వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

అంతే కాకుండా బుధవారం రోజు తిరుమల శ్రీవారిని దాదాపు 62,000 మంది భక్తులు దర్శించుకున్నారు.

వీరిలో దాదాపు 23 వేల మంది భక్తులు తల నీలాలు సమర్పించుకొని తమ మొక్కలు తీర్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

"""/" / ఇంకా చెప్పాలంటే బుధవారం రోజు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

రెండు మూడు రోజులు సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఉండేది కానీ బుధవారం రోజు నుంచి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది.

వైరల్ వీడియో: భూమిని జేసీబీ తో తవ్వుతుండగా అనుకోకుండా బయటపడిన..?!