ఒక్క కొబ్బరికాయకు 6.5 లక్షలు చెల్లించాడు..దీని స్పెషల్ ఏంటంటే!

మనం మాములుగా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లడ్డు వేలం పాట గురించి వింటూనే ఉంటాం.భక్తులు వినాయకుడి లడ్డు కోసం పోటీ పడి మరి లక్షల్లో పెట్టి లడ్డు ను దక్కించు కుంటారు.

 Devotee In Karnataka's Jamkhandi Pays Rs 6.5 Lakh For Coconut, Latest Telugu New-TeluguStop.com

ప్రతి సంవత్సరం ఇదొక ఆనవాయితీగా వస్తుంది.వేల నుండి లక్షల రూపాయల వరకు వేలంలో డబ్బు పెట్టి వినాయకుడి ప్రసాదంగా ఆ లడ్డు ను దక్కించుకుంటారు.

కానీ ఒక భక్తుడు మాత్రం కొబ్బరి కాయకు లక్షల్లో చెల్లించి సొంతం చేసుకున్నాడు.అంత భారీ మొత్తం చెల్లించి మరి సొంతం చేసుకోవడానికి ఆ కొబ్బరి కాయ స్పెషల్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.

ఈ కొబ్బరి కాయను కూడా ఆ భక్తుడు వేలంలో పాట పాడి మరి 6 లక్షల 50 వేలు పెట్టి సొంతం చేసుకున్నాడు.ఈ ఘటన కర్ణాటకలో చోరు చేసుకుంది.

ఒక గుడిలో వేలం సందర్భంగా ఆ కొబ్బరి కాయను అతడు అంత భారీ మొత్తం పెట్టి దక్కించుకున్నాడు.

కర్ణాటక లోని బాగల్కోట్ జిల్లా జమఖండి గ్రామంలోని 12 శతాబ్దానికి చెందిన ఒక ఆలయం ఉంది.

ఆ ఆలయంలో ప్రతి ఏడాది కొబ్బరి కాయలను వేలం వేస్తూ ఉంటారు.మలింగరాయ దేవాలయంలోని కొబ్బరి కాయను దక్కించు కోవడానికి వేలంలో చాలా మంది పాల్గొన్నారు.

మలింగరాయ దేవుడు శివుడి ప్రతిరూపంగా అక్కడి ప్రజలు భావిస్తారు.

దేవుడి సిమ్హాసనంలో ఉంచిన కొబ్బరికాయను దక్కించు కోవడం ఎంతో అదృష్టంగా భావిస్తారు.

అందుకే అంత పోటీ పడి మరి ఈ కొబ్బరి కాయను సొంతం చేసుకుంటారు.ఆలయ అధికారులు మాట్లాడుతూ ఈ ఆలయంలో కొబ్బరి కయ వేలం ఇప్పటి వరకు 10 వేలు దాటలేదు కానీ ఈసారి మాత్రం లక్షల్లో పాడారు.

దీంతో అందరు ఆశ్చర్య పోయాం అని తెలిపారు.

Telugu Coconut, Fruitvendor, Karnataka, Latest Telugu, Lucky Coconut, Telugu-Lat

ఈ డబ్బును ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని వారు తెలిపారు.కొంతమంది దీనిని ముద్ర నమ్మకంగా అనుకుంటారు కానీ భక్తులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వాటిని దక్కించుకోవడం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube