దేవుడి దర్శనానికొచ్చి షాక్ తిన్న భక్తుడు.. ?

మనిషి తాను మనిషిని అన్న నిజాన్ని మరచి పాపపుణ్యాలు అన్నీ విడిచి రోజు రోజుకు స్వార్ధంగా తయారు అవుతున్నాడు.తప్పు చేయాలనే ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేస్తున్నాడు.

 Devotee Gold Chain Stolen At Queue Line, Kurnool, Mantralayam, Devotees, Gold Ch-TeluguStop.com

ఇలా పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఎందరో దొంగలు తమ పనిని యధేచ్చగా పూర్తి చేసుకుని భక్తులను మానసిక వేదనకు గురిచేస్తున్న వార్తలు తరచుగా వింటూనే ఉంటాం.

భక్తితో భగవంతుని దగ్గరకు వచ్చే భక్తులకు దొంగలు చేస్తున్న పని వల్ల ఆందోళన కలగడమే కాదు.

ఈ దైవాన్ని మనసారా కొలుచుకునే అవకాశం కూడా దక్కడం లేదట.ఇకపోతే కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయం వద్ద దర్శనానికి వచ్చిన ఓ భక్తుని బంగారం చోరికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్ధం మఠానికి శుక్రవారం ఉదయం క్యూలైన్‌లో వెళ్తున్న భక్తుడికి చెందిన 3.5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు అపహరించారట.దర్శనం అనంతరం ఆ భక్తుడు తన మెడలో బంగారు గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించాడు.వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారట.

ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారట.చూశారా చివరికి ఆలయాల్లో కూడా అపవిత్రమైన పనులుచేస్తున్న ఇలాంటి వారికి ఏదో ఒకరోజు శిక్ష పడుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది కాబట్టే వీరి ఆగడాలు సాగుతున్నాయి అంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube