తిరుమలలో చనిపోతే వైకుంఠంకి వెళ్ళొచ్చని...

తిరుమలని కలియుగ వైకుంఠం అని అందరూ అంటారు.కాశి తర్వాత హిందువులకి అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల.

 Devotee Commitssuicidenear Tirumala Temple-TeluguStop.com

అందుకే కోట్లాది భక్తులు ప్రతి సంవత్సరం తిరుమలకి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.ఇక కొండ మీద శ్రీనివాసుడు నిజంగా కొలువై ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు.

అయితే హిందువులలో ఓ మూఢ నమ్మకం ఉంది.కాశిలో చనిపోది కట్టేతో కైలాషం వెళ్తామని అందరూ నమ్ముతారు.

అందుకే చనిపోయే లోపు కాశి వెళ్లాలని అనుకుంటారు.కొందరైతే వృద్ధాప్యంలో కాశి వెళ్లి వెళ్లి చనిపోయేవారని మన పూర్వీకులు కథలుగా చెప్పేవారు.

ఇదిలా ఉంటే అలాంటి ఓ మూఢ నమ్మకంతో తిరుమల కొండ మీద ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

శ్రీవారి సన్నిధిలో వాహన మండపం వద్ద ఓ భక్తుడు లారీ క్రింద పడి చనిపోయాడు.

అయితే ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వలన జరిగిందని భావించిన పోలీసులు ముందుగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.తరువాత ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ లు పరిశీలించారు.

అందులో భక్తుడే వెళ్తున్న లారీ వెనుక టైర్ల క్రింద పడినట్లు స్పష్టంగా కనిపించింది.దీంతో అతనే కావాలని ఆత్మహత్యకి ప్రయత్నం చేశాడని నిర్ధారించుకున్నారు.తిరుమలలో చనిపోతే వైకుంఠంకి వెళ్లొచ్చనే మూఢ విశ్వాసంతోనే ఆ భక్తుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.ఈ ఘటన కారణంగా శ్రీవారి ఆలయ ద్వారాలు కొద్ది సేపు మూసేసి శుద్ధి చేసారు.

అయితే ఆలయం వద్ద ఇలా చేయడం మంచిది కాదని ఆలయ చైర్మన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube