పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ‘జల్సా’ చేసిన దేవిశ్రీ ప్రసాద్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇప్పటికే పవన్ బర్త్ డే కానుకగా ఆయన సినిమాలకు సంబంధించిన సందడి కూడా మొదలయ్యింది.

 Devisri Prasad Special Gift For Pawan Kalyan Birthday, Devisri Prasad, Jalsa, Pa-TeluguStop.com

తాజాగా భీమ్లా నాయక్ చిత్రం నుండి టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, పవన్ అభిమానులను ఉర్రూతలూగించే విధంగా ఈ పాట ఉన్నట్లు వారు అంటున్నారు.ఇక ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పవన్ పుట్టినరోజు కానుకగా ఓ సర్‌ప్రైజ్ గిఫ్టును అందించాడు.

గతంలో పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రానికి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాకు మ్యూజిక్ మేజర్ అసెట్‌గా మారడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా తెరకెక్కించే సమయంలో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ సిద్ధం చేశాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఈ పాటను అప్పట్లో రిలీజ్ చేయలేకపోయారు.

అయితే పవన్ పుట్టినరోజు కానుకగా జల్సా ప్రమోషనల్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ సర్‌ప్రైజ్ కానుకగా రిలీజ్ చేశారు.ఈ పాటతో మరోసారి ‘జల్సా’ మేనియాను ప్రేక్షకులకు చూపించాడు దేవిశ్రీ ప్రసాద్.

మొత్తానికి పవన్ బర్త్ డే కానుకగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా దూసుకుపోతుంది.పవన్ ‘జల్సా’ సినిమాను మరోసారి గుర్తు చేసిన దేవిశ్రీ ప్రసాద్‌కు పవన్ అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక పవన్ నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లను వరుసగా ప్రకటించనుండటంతో సోషల్ మీడియాలో పవన్ స్టామినాను మరింత చాటుతున్నారు అభిమానులు.ఇక పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube