ఆ విషయంలో బన్నీ అభిమానులను క్షమాపణలు కోరిన దేవిశ్రీ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.ఇక ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి.

 Devisri Prasad Asks Apologizes To Allu Arjun Fans Details, Allu Arjun,devi Sri P-TeluguStop.com

ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా దేవి శ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

ఈనెల రెండవ తేదీ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ దేవిశ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అల్లు అర్జున్ చేసిన ఈ విషెస్ చూసుకోలేకపోయారు.తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ విష్ చేసిన ట్వీట్ చూసి ఆయన ట్వీట్ కి రిప్లై ఇవ్వడమే కాకుండా బన్నీ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Devi Sri Prasad, Devisriprasad, Devisri Pras

ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ అల్లు అర్జున్ కు ఇక పుష్ప సినిమా కోసం అదరగొట్టే ఆల్బమ్ సిద్ధమవుతుందని , ఆల్బమ్ ను కూడా ఐకానిక్ గా మారుద్దామని అల్లు అర్జున్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.ఈ విధంగా ఈయన ఎంతో పాజిటివ్గా స్పందిస్తూ తనకు రిప్లై ఇవ్వడమే కాకుండా ఆ ట్వీట్ చూసుకోక పోవడానికి కారణాన్ని తెలియజేస్తూ క్షమాపణలు చెప్పడంతో ఈయన సింప్లిసిటీకి బన్నీ అభిమానులు ఎంతో ఫిదా అవుతున్నారు.ఇక త్వరలోనే వీరి కాంబినేషన్ లో పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube