పోలవరం ఆపడానికి కారణం అదేనన్న మాజీ మంత్రి

ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ను రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిలిపేయడం పట్ల మాజీ మంత్రి టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్ట్‌ పనులను తమ వారికి కట్టబెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా రివర్స్‌ టెండరింగ్‌ కార్యక్రమంను తెరపైకి తీసుకు వచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి దేవినేని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.

 Devineni Ummamaheshwarao Comments Ycp And Polavaram Project Tdp-TeluguStop.com

ఒక్క సంవత్సరంలో పోలవరం పనులు అన్ని కూడా పూర్తి అయ్యేవి.కాని ఇప్పుడు మొత్తం మొదటికి తీసుకు వచ్చారు.

చాలా కష్టపడి నిర్మించిన పోలవరంను ఇప్పుడు మొత్తం మార్చే స్థితికి వచ్చారు.

తెలుగు దేశం పార్టీపై ఉన్న అకస్సు కారణంగానే పోలవరంను జగన్‌ అడ్డుకుంటున్నాడు అంటూ దేవినేని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రానికి జీవనాడి అంటూ చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్‌ను 2013లో ప్రారంభించడం జరిగింది.ఆ సమయంలో ట్రాయ్‌ సంస్థకు పనులు అప్పగించగా వారు సరిగా నిర్వహించక పోవడంతో మరొకరికి అప్పగించారు.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కొత్త కాంట్రాక్టర్స్‌ వద్దకు ఈ ప్రాజెక్ట్‌ వెళ్తుంది.ఇలా ఎంత మంది చేతులు మారాల్సి వస్తుందో అంటూ దేవినేని ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube