వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయ లేకపోతున్నారు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమాసీబీఐ మరియు ఈడీ కేసులు ఉండటంవల్ల వాటినుంచి బయటపడటానికి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించ లేక పోతున్నారని, కేంద్ర పెద్దల దగ్గర లొంగిపోయారు అందుకే మౌనం వహిస్తున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.
దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల్లో 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేస్తుంటే ఉక్కు పరిశ్రమ గేటు వద్ద వెళ్లి మాట్లాడే ధైర్యం కూడా వైసిపి మంత్రి అవంతి శ్రీనివాస్, కన్నబాబు విజయసాయిరెడ్డికి లేకుండా పోయింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దేవినేని ఉమ.
అదేవిధంగా పోలవరం పనుల విషయంలో కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అని మండిపడ్డారు.కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టి పోలవరం ప్రాజెక్టు భ్రష్టు పట్టించారు అని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ.