రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి -ఉమా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు తీర్పులను ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ నేత దేవినేని ఉమమహేశ్వరరావు ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వానికి ఏమైందని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

 Andra Pradesh, Tdp, Ycp, Devineni Uma, Cm Jagan, Nimmagada Ramesh Kumar-TeluguStop.com

గవర్నర్ జోక్యం చేసుకోవాలా, ఇదేం తీరని విమర్శించారు.కేసుపై తమకు అవగాహన ఉందని, రాష్ట్రంలో అసలేం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ మాటలు వినపడుతున్నాయా ముఖ్యమంత్రి జగన్ గారు అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం స్పందించక పోవడంతో రమేష్ కుమార్ ను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు చేశారు.మరోవైపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడం పట్ల దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.జోరు తగ్గని కరోనా, 8,147 కేసులు, 49 మరణాల నమోదు.

ఊపిరి పోస్తారని వస్తే ఉసురే పోయిందని దేవినేని ఉమ విమర్శించారు.కరోనా లక్షణాలు ఉంటే వైద్యం అందదని, ఎంత బ్రతిమాలినా వైద్యం దుస్థితి ప్రభుత్వానికి కనపడుతుందా అని ప్రశ్నించారు.

ఆరు నెలలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube