టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( TDP Chandrababu Naidu ) పై చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ తమ్మినేని సీతారాం పై సుమోటోగా కేసు బుక్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ మైలవరం ఎస్.హెచ్.
ఓ ఫిర్యాదు.చంద్రబాబు నాయుడు కి ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ తీసివేయమని, మేము ఫినిష్ చేస్తాం అని మాట్లాడారు.
మనుషులు మాట్లాడే భాష కాదు … పశువులకు గొంతు ఉంటే ఆ భాష మాట్లాడవు.
ఫినిష్ అయిపోతావ్ సెక్యూరిటీ తీసివేయండి అని బాధ్యతయుతమైన స్పీకర్ స్థానంలో ఉండి ఆ భాష మాట్లాడేవు అంటే ఆ స్థానంలో ఉండే నైతిక అర్హత తమ్మినేని కి లేదు .తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) చదువుకున్న డిగ్రీల పై కూడా మీడియాలో చాలా కథనాలు వచ్చాయి ఆ సమాచారం అంతా ప్రజలకు తెలుసు.రాజీనామా చేయకుండా స్పీకర్ పదవిలో ఉండి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే ఫ్రస్టేషన్ లో ఉండి మాట్లాడుతున్నారు.
బాబాయి హత్య ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( CM YS Jagan )కి తెలుసని సిబిఐ వారు చార్జిషీట్ వేశారు .ఆముదాలవలసలో కూన రవికుమార్, వర్ల రామయ్య గారు డిజిపి కి లేఖ రాశారు.వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాంపై సుమోటోగా కేసు బుక్ చేయాలి
.