వంగవీటి అయిపోయింది ఇప్పుడు దేవినేని అంట

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి నుంచి కుర్ర హీరోల వరకు అందరూ బయోపిక్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Devineni Nehru Biopic Going On Screen-TeluguStop.com

ఇప్పటికే తెలుగులో ఒక అరడజనుకి పైగా బయోపిక్ కథలు తెరపైకి వచ్చాయి.అయితే వాటిలో కేవలం సావిత్రి జీవిత కథ మహానటి మాత్రమే ప్రేక్షకులని మెప్పించింది.

ఎన్టీఆర్ బయోపిక్ గా క్రిష్, ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్ర్పెక్షకుల సహనాన్ని పరీక్షించాయి.ఇక కేసీఆర్ బయోపిక్ నేరుగా యుట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నారు.

ఇక మరికొన్ని బయోపిక్ లు ఎప్పుడు వచ్చాయో కూడా ఎవరికీ తెలియదు.

దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం దేవినేని మూవీ కూడా ఒకటి.

దేవినేని నెహ్రు రెండేళ్ళ క్రితం చనిపోయారు.గతంలో ఆర్జీవి తీసిన సినిమాలో దేవినేనిని కాస్తా నెగిటివ్ కోణంలో చూపించారు.

ఈ నేపధ్యంలో తాజాగా దేవినేని బయోపిక్ ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది.

మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.1977లో దేవినేని నెహ్రూ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ మూవీలో దేవినేని నెహ్రూగా నందమూరి తారక రత్న నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube