టీడీపీ కి దేవినేని...గుడ్ బై...!!  

Devineni Mallikarjuna Rao Join In Janasena Good Bye To Tdp-jansena,repalle Constituency,tdp

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో ఉన్న గెలుపు గుర్రాలన్నీ వైసిపి చెంతకు చేరి పోతుంటే ఏం చేయాలో అర్థం కాక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడుకి మరొక షాక్ తగిలింది. గుంటూరు జిల్లా లో సీనియర్ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న దేవినేని మల్లికార్జున రావు ఈ సమయంలో టీడీపీ ని వీడనున్నారని ఉన్నారని తెలుస్తోంది..

టీడీపీ కి దేవినేని...గుడ్ బై...!!-Devineni Mallikarjuna Rao Join In Janasena Good Bye To TDP

2004లో రేపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దేవినేని వైయస్ తో ఉన్న విభేదాల కారణంగా 2009లో లో టికెట్ దొరకకపోవడంతో సైలెంట్ అయ్యారు.

ఆ తరువాత రాష్ట్ర అ పునర్విభజన అనంతరం 2014 ఎన్నికల కంటే ముందే చంద్రబాబు పంచన చేరారు. అందుకుగాను చంద్రబాబు ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని మాట ఇవ్వడంతో ఆ సమయంలో లో టికెట్ రాకపోయినా స్థానిక నేతలకు కు మద్దతుగా నిలిచారు. అయితే 2019 ఎన్నికలు దగ్గరకు వచ్చినా సరే ఆయనకు ఇప్పటివరకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోగా, వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి కనబడకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై చంద్రబాబును కలిసిన ఆయన నుంచి సరైన హామీ రాకపోవడంతో మనస్థాపానికి కి గురైన దేవినేని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ పార్టీలోకి వెళ్లాలని అనుకున్నా తన తండ్రితో ఉన్న విభేదాల కారణంగా దేవినేని అటు వైపు అడుగులు వేయడం లేదని అంటున్నారు దేవినేని వర్గీయులు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

అంతేకాదు రేపల్లె నియోజకవర్గం నుంచి దేవినేని ని ఖరారు చేసినట్లుగా కూడా వార్తలు రావడంతో ఆయన వర్గం ఫుల్ జోష్ లో ఉంది ఎందుకంటే ఇక్కడ అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు రెండుగా చీలడంతో పాటు, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కూడా దేవినేనికి పోల్ అవనున్నాయట. ఈ క్రమంలోనే దేవినేనికి ఉన్న క్లీన్ ఇమేజ్ అపారమైన అనుభవం కూడా బాగానే కలిసొస్తుందని అంటున్నారు విశ్లేషకులు.