తెలుగులో ప్రస్తుతం మాజీ ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత గాథ ఆధారంగా ఓ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నర్రా నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు దర్శకుడు నర్రా నాగేశ్వరరావు విడుదల చేశారు.
అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
అయితే ఈ చిత్రానికి “దేవినేని – బెజవాడ సింహం” అనే టైటిల్ ని ఖరారు చేశారు.
అంతేగాక ఈ చిత్రంలో హీరోగా నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు కోటి, బెనర్జీ, సురేష్ కొండేటి, ప్రసన్న కుమార్, తేజ రాథోడ్, శివారెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో లీడ్ రోల్ పాత్రలో నటిస్తున్న నందమూరి తారక రత్న దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమాల్లో మళ్ళీ నటిస్తున్నాడు. దీంతో నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.