మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో... ఈసారైనా....

తెలుగులో ప్రస్తుతం మాజీ ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత గాథ ఆధారంగా ఓ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నర్రా నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు దర్శకుడు నర్రా నాగేశ్వరరావు విడుదల చేశారు.

 Hero Taraka Ratna Re Entry After Three Years, Devineni Bezawada Simham, Nandamur-TeluguStop.com

అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

అయితే ఈ చిత్రానికి “దేవినేని – బెజవాడ సింహం” అనే టైటిల్ ని ఖరారు చేశారు.

 అంతేగాక ఈ చిత్రంలో హీరోగా నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నాడు.  అలాగే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు కోటి, బెనర్జీ, సురేష్ కొండేటి, ప్రసన్న కుమార్, తేజ రాథోడ్, శివారెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో లీడ్ రోల్  పాత్రలో నటిస్తున్న నందమూరి తారక రత్న దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమాల్లో  మళ్ళీ నటిస్తున్నాడు. దీంతో నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube