అదే జ‌రిగితే జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవినాష్‌కు తిరుగులేన‌ట్టే..!

యువ నాయ‌కుడు.దేవినేని నెహ్రూ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌కు త‌న స‌త్తా నిరూపించుకునేందుకు మంచి అవ‌కాశం వ‌చ్చింది.

 Devineni Avinash Strategies In Vijayawada Politics, Ycp Leaders, Ys Jagan, Devin-TeluguStop.com

వైసీపీలోకి వ‌చ్చిన ఈ కొద్ది నెల‌ల కాలంలోనే బెజ‌వాడ మాస్ లీడ‌ర్‌గా ఎదిగిన అవినాష్ త‌న తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేశారు.క్షేత్ర‌స్థాయి నుంచి పార్టీ ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ తూర్పును వైసీపీ కంచుకోట‌గా మార్చేలా క‌ష్ట‌ప‌డుతున్నారు.

అయితే అవినాష్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా ప్ర‌త్య‌క్షంగా త‌న స‌త్తా ఏంటో ఫ్రూవ్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చేసింది.దీనికి కార‌ణం.

స్థానిక ఎన్నిక‌ల‌కు గంట మోగుతుండ‌డ‌మే.నేడో రేపో.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేస్తోంది.అంటే.వ‌చ్చే ఏడాదిలో స్థానిక పంచాయ‌తీలు, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు, కార్పొరేష‌న్ల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గుతాయి.

ఈ క్ర‌మంలో బెజ‌వాడ కార్పొరేష‌న్‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టి విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌పైనే ఉంది.

ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంద‌న్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాలంటే ఇక్క‌డ వైసీపీ పాగా వేయాలి.అయితే.

ఇక్క‌డ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీని ఢీకొట్టి కార్పోరేష‌న్‌లో వైసీపీని కూర్చోబెట్ట‌డం అంత ఈజీ కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌.మ‌రీ ముఖ్యంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ల‌ల ఎక్కువ‌గా క‌మ్మ ఓటు బ్యాంకు ఉంది.

వీరిని వైసీపీకి అనుకూలంగా మార్చ‌డం పెద్ద స‌వాలే.అయితే గ‌త ఏడెనిమిది నెల‌ల్లో అవినాష్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు.క‌రోనా స‌మ‌యంలోనూ ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండి వారికి అనేక రూపాల్లో సేవ‌లు చేశారు.

ఇక‌, త‌ర్వాత కూడా నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం పాద‌యాత్ర‌లు చేస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Bejawada, War-Political

fr ప్ర‌తి రోజు నాలుగైదు కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వుతున్నారు.ఎమ్మెల్యే కంటే ఎక్కువ‌గా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

ఈ ప‌రిణామాల‌తో దేవినేని అవినాష్ గ్రాఫ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది.గ‌తంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పెద్ద‌గా పుంజుకోలేదు.

కేవ‌లం 9 చోట్ల మాత్ర‌మే కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది.మొత్తంగా టీడీపీ హ‌వానే సాగింది.

అయితే.ఇప్పుడు ప్ర‌ధానంగా టీడీపీ బ‌లంగా ఉన్న‌ డివిజ‌న్ల‌పై అవినాష్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

దీంతో ఆయ‌న క‌నీసం ఇక్క‌డ 17 నుంచి 18 డివిజ‌న్లు వైసీపీ ఖాతాలో వేసేలా చాప‌కింద నీరులా త‌న‌దైన వ్యూహాల‌తో దూసుకుపోతున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Bejawada, War-Political

అదే స‌మ‌యంలో నగ‌రంలో ప‌శ్చిమ నుంచి మంత్రి వెల్లంప‌ల్లి, సెంట్ర‌ల్ నుంచి బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.తూర్పులో మాత్రం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ఉన్నారు.త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ధీటుగా అవినాష్ తూర్పులో మెజార్టీ డివిజ‌న్ల‌లో వైసీపీ పాగా వేసేలా చేయ‌డంలో స‌క్సెస్ అయితే… జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవినాష్‌కు తిరుగులేన‌ట్టే అన్న‌ది బెజ‌వాడ రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube