ఆత్మవిశ్వాసం నింపిన 'ఊపిరి'.. మనోధైర్యం ముందు వైకల్యాన్ని ఓడించి.. !

ఈ బ్రతుకు పోరాటంలో పరిస్దితులు అనుకూలంగా లేవని నిందించుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు.ఎందుకంటే ఒకటే జననం, ఒకటే మరణం.

 Devika Rani Excels In Various Field Even In A State Of Immobility-TeluguStop.com

మధ్యలో ఉన్న జీవితం ఓ వరం.లక్ష్యాన్ని చేరడానికి మనకు చేరువలో ఉన్న ప్రయాణం.

జీవితం అంటే నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా సాగిపోయే మార్గం కాదు.కాకూడదు.అందుకే ఊపిరున్నంత వరకు పోరాటం చేయి.ఈ పోరాటంలో విజేతగా నిలుస్తావనే ఆత్మవిశ్వాసంతో అడుగు వెయ్యి.

 Devika Rani Excels In Various Field Even In A State Of Immobility-ఆత్మవిశ్వాసం నింపిన ఊపిరి’.. మనోధైర్యం ముందు వైకల్యాన్ని ఓడించి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంటి ఇన్ని నీతులు చెబుతున్నారని అనుకుంటున్నారా.ఇదే నిజం ఎందుకంటే ఒక దివ్యాంగురాలు ఎందరికో స్పూర్తినిచ్చేలా జీవిస్తున్నప్పుడు ఇలా ఆలోచించడంలో పొరపాటు లేదు.

మరి ఆ వివరాలు తెలుసుకుంటే.

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న దేవిక అనే యువతి పుట్టుకతోనే కాళ్లు పనిచేయకున్నా, కుంగిపోకుండా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నది.

ఇంట్లోనే ట్యూషన్‌ మాస్టర్ల సాయంతో 6వ తరగతి వరకు చదివింది.అనంతరం పాఠశాలకు వెళ్లి పదో తరగతి పూర్తి చేసింది.కాగా ప్రస్తుతం బీకామ్‌ కంప్యూటర్స్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న దేవికా ఖాళీ సమయంలో చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ ఉపాధి పొందుతున్నది.

అంతే కాకుండా ఇటీవల నిర్వహించిన తెలంగాణ మిస్‌ ఎబిలిటీ పోటీల్లోనూ విజేతగా నిలిచింది.

సోషల్‌ మీడియాలోనూ ఓ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి ప్లాంటేషన్‌ చేయడంపై వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నది.కరోనా క్లిష్ట సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో తన సాటి దివ్యాంగులకు భరోసానిస్తున్నది.

అయితే ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున చేసిన క్యారెక్టర్‌ నాకు ఇంప్రేషన్ అని చెప్పుకుంటున్న దేవిక దివ్యాంగురాలైతేనేం మనోధైర్యంతో ముందుకుసాగుతున్నది.

వీల్‌చైర్‌కు పరిమితమైన జీవితాలకు కొత్త వెలుగులు చూపిస్తూ, విభిన్న రంగాల్లో తన ప్రతిభ ప్రదర్శిస్తూ, మనోధైర్యం ముందు వైకల్యాన్ని ఓడించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది ఉన్న ఒక్క జిందగీని సంపూర్ణంగా పూర్తిచేసుకుంటుంది.

కాబట్టి ఈమే గాధ పిరికివారిలా భయపడే వారికి ఇన్స్ప్రేషన్ కావాలి.

#Dilsukhnagar #Wheelchair #Devika #Courage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు