దేవిశ్రీ పెళ్లి వార్తలు.. ‘రంగస్థలం’ హీరోయిన్‌ వధువు??  

  • రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఈ వార్త చాలా సంవత్సరాలుగా వస్తుంది. అయితే ఈసారి మాత్రం నిజమోనేమో అన్నట్లుగా కాస్త బలంగా వార్తలు వనిపిస్తున్నాయి. గతంలో ఒక హీరోయిన్‌ తో అఫైర్‌ ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఆమెను పెళ్లి చేసుకుంటాడేమో అంటూ వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లుగానే మిగిలి పోయాయి. తాజాగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్‌ పెళ్లి గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్‌ను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Devi Sri Prasad To Marry Rangasthalam Actress Poojitha Ponnada-Dsp Marraige Music Director

    Devi Sri Prasad To Marry Rangasthalam Actress Poojitha Ponnada

  • దేవిశ్రీ ప్రసాద్‌ నటి పూజితతో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న పూజిత ఆమద్య ‘రంగస్థలం’ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ కూతురు(ఆది లవర్‌) పాత్రలో కనిపించింది. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అవ్వడంతో ఆమె పెద్దగా నోటెడ్‌ కాలేదు. హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తున్న పూజిత తాజాగా దేవిశ్రీని వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • Devi Sri Prasad To Marry Rangasthalam Actress Poojitha Ponnada-Dsp Marraige Music Director
  • దేవిశ్రీ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు చాలా కాలంగా పెళ్లి పెళ్లి అంటూ వస్తున్నారు. ఆయన మాత్రం తర్వాత తర్వాత అంటూ నెట్టుకు వస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగాయనే చెప్పాడు. తన పెళ్లి వల్ల తమ్ముడి పెళ్లి ఆగుతుందనే ఉద్దేశ్యంతో దేవిశ్రీ ప్రసాద్‌ ఎట్టకేలకు పెళ్లికి సిద్దం అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే పూజిత ఆయన సెలక్షనా లేకుంటే కుటుంబ సభ్యులు పూజితను ఎంపిక చేశారా అనేది తెలియాలి. అసు పూజితతో దేవిశ్రీ ప్రసాద్‌ ప్రేమలో ఉన్న విషయంలో నిజం ఎంత అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.