ఖిలాడీతో సెంచరీ ఫీట్ ని అందుకోబోతున్న రాక్ స్టార్ దేవిశ్రీ

దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని దేవిశ్రీప్రసాద్ క్రియేట్ చేసుకున్నాడు.మొదటి సినిమా పేరుని తన పేరుగా మార్చుకొన్న దేవిశ్రీ చాలా వేగంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీచేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

 Devi Sri Prasad Reach 100 Movies Feet With Khiladi Movie-TeluguStop.com

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన మ్యూజిక్ దర్శకుడుగా పేరు సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన హవాని ఇప్పటికి దేవిశ్రీ ప్రసాద్ కొనసాగిస్తున్నాడు.

ఏడాదికి కనీసం ఆరు సినిమాలకి తక్కువ కాకుండా మ్యూజిక్ అందిస్తున్నారు.

 Devi Sri Prasad Reach 100 Movies Feet With Khiladi Movie-ఖిలాడీతో సెంచరీ ఫీట్ ని అందుకోబోతున్న రాక్ స్టార్ దేవిశ్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Devi Sri Prasad, Khiladi Movie, Pushpa Movie, Ramesh Varma, Raviteja-Movie

రీసెంట్ గా హిందీలో సల్మాన్ ఖాన్ రాధే మూవీలో సిటీమార్ సాంగ్ తో మరోసారి ఇండియన్ వైడ్ గా అందరి దృష్టిని తన సంగీతంగా ఆకట్టుకున్నాడు.క్లాసికల్, వెస్ట్రన్ ఏదైనా కాని దేవిశ్రీ నుంచి రాబట్టుకోవచ్చని దర్శకుల నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది.ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ మారిపోతున్నాడు.

ఇదిలాఉంటే రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాతో మన రాక్ స్టార్ మరో రేర్ ఫీట్ ని అందుకోబోతున్నాడు.

తన కెరియర్ లో ఖిలాడీ మూవీ వందో చిత్రంగా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతూ ఉండగా డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

#Raviteja #Devi Sri Prasad #Ramesh Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు