సుకుమార్ సినిమాలకు దేవి అలా వాయిస్తున్నాడా?  

Devi Sri Prasad No Remuneration For Sukumar Movies, Sukumar, Devi Sri Prasad, Uppena, Tollywood News - Telugu Devi Sri Prasad, Sukumar, Tollywood News, Uppena

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు ఎప్పుడూ సంగీతం అందించే దేవిశ్రీ ప్రసాద్, ఆయన సినిమాలకు ప్రతిసారి అదిరిపోయే సంగీతం అందిస్తూ వచ్చాడు.ఇక సుకుమార్ డైరెక్ట్ చేసే సినిమాలే కాకుండా ప్రొడ్యూస్ చేసే సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తుంటాడు.

 Sukumar Devi Sri Prasad Uppena

ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్ చిత్రాలుగా నిలుస్తుంటాయి.తాజాగా సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఉప్పెన చిత్రానికి కూడా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచాయి.అయితే సుకుమార్ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడనే సందేహం అందరిలో నెలకొంది.

సుకుమార్ సినిమాలకు దేవి అలా వాయిస్తున్నాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ చిత్రాలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోడని తెలుస్తోంది.సుకుమార్ నిర్మాతగా వ్యవహరించే చిత్రాలకు ఆయన కొంత మేర షేర్లు తీసుకుంటాడట.అటు డైరెక్టర్‌గా సుకుమార్ తెరకెక్కించే చిత్రాలకు కూడా దేవిశ్రీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.

ఇలా రెమ్యునరేషన్ కాకుండా సినిమాల్లో షేర్ తీసుకుంటుడటంతో తమకు సంతోషంగా ఉంటుందని చిత్ర నిర్మాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తుంటారు.

కుమారి 21 ఎఫ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ ఈ అలవాటు చేసుకున్నాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుండటంతో హీరోలు సైతం వీరిద్దరినే ఎక్కువగా రికమెండ్ చేస్తుంటారు.

#Uppena #Sukumar #Devi Sri Prasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukumar Devi Sri Prasad Uppena Related Telugu News,Photos/Pics,Images..