బాలీవుడ్ లో అవకాశం పట్టేసిన దేవిశ్రీ ప్రసాద్  

Devi Sri Prasad Music Composed For Salman Khan Movie In Bollywood - Telugu, Prabudeva, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ దర్శకుడుగా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ కొనసాగుతున్నాడు.ప్రస్తుతం కేవలం స్టార్ హీరోల వరకే సినిమాలకి పరిమితం అయిన దేవిశ్రీ లిమిటెడ్ గా సినిమాలు చేస్తున్నాడు.

 Devi Sri Prasad Music Composed For Salman Khan Movie In Bollywood

అయిన కూడా మ్యూజిక్ దర్శకుడుగా ఎ.ఆర్.రెహమాన్ తర్వాత సౌత్ లో అతనే అత్యధికంగా తీసుకుంటున్నారు.ఇప్పటికే తెలుగులో టాప్ హీరోలందరికి మ్యూజిక్ ఇచ్చేసిన దేవిశ్రీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆ ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది.

బాలీవుడ్ లో ఒక్క బొమ్మ పడితే దేవిశ్రీ రేంజ్ మారిపోతుందని అందరూ చర్చించుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఊహించని విధంగా బాలీవుడ్ లో మొదటి సినిమానే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేసే ఛాన్స్ ని దేవిశ్రీ సొంతం చేసుకున్నాడు.

బాలీవుడ్ లో అవకాశం పట్టేసిన దేవిశ్రీ ప్రసాద్-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రాధే అనే సినిమా తెరకెక్కుతుంది.ప్రభుదేవా దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతో అనే విషయం అందరికి తెలిసిందే.

తెలుగులో ప్రభుదేవా చేసిన రెండు సినిమాలకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ అనే విషయం తెలిసిందే.ఇక ఈ నేపధ్యంలో ప్రభుదేవా ఈ రాధే సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పేరుని సల్మాన్ ఖాన్ కి సూచించడం జరిగిందని, అతను కూడా దేవిశ్రీ ఆల్బమ్స్ చూసి వెంటనే ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే రాధే సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకులని పక్కన పెట్టి సల్మాన్ ఖాన్ దేవిశ్రీ కి ఆ బాద్యతలు అప్పగించాడని సమాచారం.ఇక ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో దేవిశ్రీ పాగా వేయడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Devi Sri Prasad Music Composed For Salman Khan Movie In Bollywood Related Telugu News,Photos/Pics,Images..