పుష్ప కోసం కొత్తగాట్రై చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అనే టాక్ ముందే వచ్చేస్తుంది.అలాగే అతను సాంగ్స్ అందించిన సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్ అయినవే.

 Devi Sri Prasad Compose New Tunes For Pushpa-TeluguStop.com

అలాగే దేవిశ్రీ పాటల్లో ఎదో ఒక సాంగ్ కచ్చితంగా సోషల్ మీడియాలో షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో ఉంటుంది.రంగస్థలంలో జిగేలు రాణి సాంగ్ కి ఎంత ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఇక చెప్పాల్సిన పని లేదు.సుకుమార్ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకి వెళ్ళడం లేదు.

 Devi Sri Prasad Compose New Tunes For Pushpa-పుష్ప కోసం కొత్తగాట్రై చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్ వచ్చే సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్స్ అందుకున్నవే.అలాగే సుకుమార్ టేస్ట్ ఏంటో భాగా తెలిసిన వ్యక్తిగా దేవిశ్రీ అతనితో చేసే ప్రతి సినిమాకి కొత్తదనంతో స్వరాలు సమకూర్చుతూ ఉంటాడు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Director Sukumar, Pushpa, Tollywood-Movie

సినిమా రేంజ్ బట్టి సుకుమార్ ఐడియాలజీ బట్టి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఉంటుంది.చిన్న సినిమాల విషయంలో దేవిశ్రీ ప్రసాద్ అంత శ్రద్ధ పెట్టడు అనే అభిప్రాయం ఉన్న సుకుమార్ సినిమాలకి వచ్చే సరికి ఎక్కడా వంక పెట్టాల్సిన అవసరం లేదు.ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబోలో ఇప్పుడు పుష్ప మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.అల్లు అర్జున్ హీరోగా రెండు భాగాలుగా ఈ మూవీని సుకుమార్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నాడు.

అల్లు అర్జున్ కెరియర్ లో మొదటి సారి కంప్లీట్ మాసివ్ పాత్రలో ఈ సినిమా కోసం కనిపిస్తున్నాడు.ఈ నేపధ్యంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ మూవీ కోసం చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాడు.

ఈ విషయాన్ని అతనే స్వయం చెప్పుకొచ్చాడు.పుష్ప సినిమా కోసం ఇప్పటి వరకు వినని విధంగా వీలైనంత కొత్తగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే ప్రయత్నం చేస్తున్నా అని పేర్కొన్నాడు.

కచ్చితంగా నా నుంచి డిఫరెంట్ మ్యూజిక్ ని ఈ సినిమాలో చూస్తారని చెప్పుకొచ్చాడు.

#Pushpa #Devi Sri Prasad #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు