రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. నైవేద్యంగా చక్కెర పొంగలి..!

హిందూ క్యాలెండర్ ప్రకారం దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో నేడు దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే గత తొమ్మిది రోజుల నుంచి అమ్మవారిని ప్రతిరోజు వివిధ అలంకరణలో అలంకరించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించారు.

 Dasara Naivedyam, Pooja, Chakkara Pongali, Dasara 2021,dasara Special-TeluguStop.com

నవరాత్రులు ముగియడంతో నేడు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే నేడు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు.

దసరా పండుగ రోజు అమ్మవారిని రాజ రాజేశ్వరీ దేవిగా అలంకరించి అమ్మవారి అనుగ్రహం కోసం చక్కెర పొంగలిని నైవేద్యంగా తయారు చేస్తారు.అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.మరి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Dasara, Pooja-Telugu Bhakthi

కావలసిన పదార్థాలు:

బియ్యం-1కప్పు పెసరపప్పు- 1/2 కప్పు బెల్లంపొడి-1/2 కప్పు చిక్కటి పాలు- 3 కప్పులు యాలకుల పొడి ఎండ కొబ్బరి నెయ్యి తగినంత జీడిపప్పు-గుప్పెడు నీళ్లు తగినంత

తయారీ విధానం:

ముందుగా పెసర పప్పు బియ్యం కలిపి శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టాలి.ఈ క్రమంలోనే స్టౌ పై బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఎండు కొబ్బరి, జీడిపప్పు దోరగా వేయించుకోవాలి.పది నిమిషాల తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీటిని వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.ఉడికిన అన్నం బెల్లం పొడి వేసి చిన్న మంటపై బాగా కలియబెట్టాలి.

అన్నం మొత్తం దగ్గర పడుతుండగా ముందుగా వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసి మరికాస్త నెయ్యి, పాలు, యాలకుల పొడి వేసి చిన్నమంటపై రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి దించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube