బన్నీ, సుకుమార్ ( Bunny, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి పని చేశారనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.
సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దేవి నాగవల్లి( devi nagavalli ) ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.పుష్ప సినిమా టైటిల్స్ లో కూడా దేవి నాగవల్లి పేరు కనిపించడం కొసమెరుపు.
దేవి నాగవల్లి తన పోస్ట్ లో సుకుమార్ సార్ కు థ్యాంక్స్ అని పుష్ప ది రూల్ సినిమా( Pushpa the rule movie ) కొరకు ఇసుక రవ్వంత పనిచేస్తే కొండంత గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు.ఇది మీ గొప్ప మనస్సు అని కామెంట్లు చేశారు.
మీరు నా గురువు అని మీ దగ్గర వర్క్ చేస్తే వర్క్ నేర్చుకోవడం నా లక్ అని పేర్కొన్నారు.అయితే దేవి నాగవల్లి చేసిన పోస్ట్ ఇప్పుడు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో కనిపించడం లేదు.

ఆమె పోస్ట్ డిలీట్ కావడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.దేవి నాగవల్లి పుష్ప ది రూల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ ( Assistant Director )గా పని చేయగా రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని సినిమాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తారేమో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించగా థియేటర్లు మాత్రం కళకళలాడటం లేదు.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో పుష్ప ది రూల్ రిలీజ్ కాగా ఆక్యుపెన్సీ విషయంలో ఈ సినిమా నిరాశ పరుస్తోంది.పుష్ప ది రూల్ సినిమా థియేటర్లలో చాలా థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.పుష్ప ది రూల్ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







