తప్పు చేసినా వారికే స‌పోర్ట్ చేస్తుంది.. గంగ‌వ్వ గుట్టు విప్పిన దేవి?

కింగ్ నాగార్జున హోస్ట్‌గా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నా‌ల్గువ సీజ‌న్ ఇటీవ‌ల గ్రాండ్‌గా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.ఇక మొద‌టి వారం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నామా.

 Devi Nagavalli Reveals On Gangavva Bad Qualities! Devi Nagavalli, Gangavva, Bad-TeluguStop.com

లేమా అన్న చందంగా ప్ర‌వ‌ర్తించిన కంటెస్టెంట్లు రెండు, మూడు వారాల్లో బాగానే పుంజుకున్నార‌ని చెప్పాలి.ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఇంటి స‌భ్యులు మూడో శ‌నివారం పూర్తి చేసుకున్నారు.

వాస్త‌వానికి శ‌ని, ఆదివారాలు వ‌చ్చాయంటే.బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు పండ‌గే అని చెప్పాలి.
ఎందుకంటే.ఆ రెండు రోజులే నాగార్జున వ‌చ్చి ఎన్నో ఆట‌లు ఆడించ‌డంతో పాటు బోలెడ‌న్ని క‌బుర్లు చెబుతుంటారు.ఇక నిన్న శ‌నివారం కావ‌డంతో.నాగార్జున‌ వ‌చ్చి ఇంటి స‌భ్యుల‌తో ప‌లు గేమ్స్ ఆడించ‌డంతో పాటు తెగ సంద‌డి చేశారు.

అయితే ట్రూత్ టవర్ గేమ్ అనంత‌రం.మాస్క్ గేమ్ ఆడించాడు నాగ్‌.

ఈ గేమ్ కోసం కొన్ని మాస్కుల‌ను కూడా ఇంటి స‌భ్యుల ముందు ఉంచారు.

ఇక‌ ఈ గేమ్ ప్ర‌కారం.

ఒక్కో హౌజ్‌మేట్ ఒక్కో మాస్క్ తీసుకొని నాగార్జున చెప్పే వ్యక్తి ముందు ఉంచి.వారిలో బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా.టీవీ 9 దేవి నాగ‌వ‌ల్లి గంగ‌వ్వ గురించి ఎవ‌రికీ తెలియ‌ని ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట పెట్టేసింది.

నాగార్జున దేవిని.గంగ‌వ్వ బ్యాడ్ క్వాలిటీస్ గురించి అడ‌గ‌గా.

ఎవరినైతే ఇష్టపడుతుందో వారు తప్పు చేసినా వారినే గంగవ్వ సపోర్ట్ చేస్తుంద‌ని దేవి నాగవళ్లి ఆరోపించింది.

అదే ఆమెలో ఉన్న‌ బ్యాడ్ క్వాలిటీ అని స్ప‌ష్టం చేసింది.

ఈ గేమ్‌లోనే గంగ‌వ్వ‌ను దేత్తడి హారిక గురించి నాగ్ అడ‌గ‌గా.బ్రష్ చేసుకోకుండానే హారిక టీ, కాఫీలు తాగేస్తుంద‌ని చెప్పేసింది.

దీంతో హారిక ఇజ్జత్ అంతా పోయింది.అయితే గంగ‌వ్వ మాటల్ని క‌వ‌ర్ చేసేందుకు.

తాను బ్రష్ చేసి వేడి నీళ్లు తాగిన తరవాతే ఏ ప‌నైనా చేస్తాన‌ని.అది గంగ‌వ్వ గ‌మ‌నించ‌లేద‌ని చెప్పుకొచ్చింది.

ఇక మిగిలిన ఇంటి స‌భ్యులు కూడా ఎవ‌రి ఒపినియ‌న్ వారు బ‌య‌ట‌పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube