కొత్త కారు కొన్న దేవీ నాగవల్లి.. రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం?

మనం ఒక్కోసారి ఎదుటివారి ముఖం, మాటతీరు చూడగానే వారి ప్రవర్తన ఎలాంటిదో, ఎలాంటి వారో అంచనా వేస్తాం.నిజానికి అది సమంజసం కాదు.

 Devi Nagavalli Bought New Skoda Octavia Automatic Car-TeluguStop.com

ఎవరి గురించైనా పూర్తిగా తెలియాలంటే వారితో కలిసి ప్రయాణం చేస్తేనే వారేంటో తెలుస్తోంది.ప్రతీసారి మన అంచనా కూడా ఒప్పు కాకపోకపోవచ్చు కదా.సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేసినంత మాత్రానా వారు రియల్‌లైఫ్‌లో కూడా విలన్ అయిపోరు కదా.అలాంటి కోవకు చెందినవారే ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోన్న దేవీ నాగవల్లి.

ఈమె గురించి చెప్పాలంటే కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు, ఆ తరువాత అని చెప్పుకోవాలి.ఎందుకుంటే అంతకు ముందు ఆమె మీద విపరీతమైన నెగెటివిటీఉండేది.ఆ తర్వాత ఆమెప్రవర్తన, నడవడిక అన్నింట్లోనూ ప్రజలు చూసే కోణం దాదాపుగా మారిపోయింది.కానీ ఆమెకు అంతకు ముందు ఉన్ననెగెటివ్ ఇమేజ్ మాత్రం అలా వెంటాడుతూ వచ్చింది.

 Devi Nagavalli Bought New Skoda Octavia Automatic Car-కొత్త కారు కొన్న దేవీ నాగవల్లి.. రేటు ఎంతో తెలిస్తే అవ్వడం షాక్ ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా కొన్ని రోజుల్లోనే ఆమె బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.కానీ దేవీ నాగవల్లి ఏనాడూ కూడా ఆ బిగ్ బాస్ ట్యాగ్‌ను మోసేందుకు ఇష్టపడనట్టు కనిపిస్తోంది.

Telugu Ariyana, Bigg Boss, Biggboss Telugu, Devi Nagavalli, Jurnalist, New Car, Social Media-Movie

బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చిన అనంతరందేవీ నాగవల్లి మళ్లీ తన పనిలో తాను నిమగ్నం అయింది.కానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కొందరితో మాత్రం ఇంకా ఆ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారుఅరియానాతో దేవీ నాగవల్లి ఇంకాస్త క్లోజ్‌గా ఉంటోంది.ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఓ సందేశాత్మక లఘు చిత్రంలో నటించారు కూడా.అయితే అరియాణా ఈ మధ్యే కొత్త కారు కొన్న విషయం తెలిసిందే కాగా ఇప్పుడు దేవీ నాగవల్లి కూడా స్కోడా కార్ కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.

దీని ధర దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఇదే విషయాన్ని దేవి నాగవల్లి సోషల్ మీడియా ద్వారా తన కొత్త కారుతో దిగినటువంటి ఫోటోను షేర్ చేస్తూ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

#Bigg Boss #Devi Nagavalli #Car #Ariyana #Jurnalist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు