దేవి నాగవల్లి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…? బిగ్ బాస్ హౌస్ లో నవ్వులే నవ్వులు…!  

Devi Nagavalli Bold Comments in Biggboss4, telugu bigg boss, bigg boss 4, Devi nagavalli, star maa, social media - Telugu Bigg Boss 4, Devi Nagavalli, Social Media, Star Maa, Telugu Bigg Boss

తెలుగు లో బిగ్ బాస్ 4 సీజన్ మొదటి వారం దాటి రెండవ వారంలో కి అడుగుపెట్టింది.మొదటి వారం మొత్తం ఏడుపులు, గోలలతో చప్పగా సాగినా, ఇక ఇప్పుడు రెండో వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది.

TeluguStop.com - Devi Nagavalli Bold Comments Bigg Boss4 Promo

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక రెండవ వారం సంబంధించి నిన్న నామినేషన్ ప్రక్రియ జరగగా అందులో మొత్తం 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.ఈ తొమ్మిది మందిలో అమ్మ రాజశేఖర్, నోయల్, కరాటే కళ్యాణి, గంగవ్వ, మోనాల్ గజ్జర్, హారిక, అభిజిత్, కుమార్ సాయి, సోహెల్ ఉన్నారు.

TeluguStop.com - దేవి నాగవల్లి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా… బిగ్ బాస్ హౌస్ లో నవ్వులే నవ్వులు…-General-Telugu-Telugu Tollywood Photo Image

వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి కూడా మొదటిరోజే నామినేషన్ లోకి వచ్చాడు.

ఇకపోతే మంగళవారం ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమో ని విడుదల చేసింది స్టార్ మా.

ఇక ఆ ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు అందరూ చిత్ర విచిత్ర గెటప్ లతో కనిపిస్తున్నారు.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కాస్త హడావిడి కూడా జరిగినట్లు అర్థమవుతోంది.

ఇక ఇందులో పక్కా పల్లెటూరి వేషధారణ వేసుకున్నట్లు టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కనబడుతుంది.అంతే కాదు ఆమె కాస్త వెరైటీగా కూడా సెటైర్లు వేసినట్లు కనిపిస్తోంది.” ఆ అబ్బాయి చూడడానికి అలా ఉన్నాడు గాని… పేపర్ పై అమ్మాయి అని రాసి ఉన్న వదిలిపెట్టడు ” అంటూ ఎవరో కంటెస్టెంట్ పై భారీ సెటైర్ వేసింది.దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులు అందరూ పగలబడి నవ్వారు.

ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కూడా కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.కొంతమంది నెటిజెన్స్ దేవి నాగవల్లి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు దేవి మీరు అన్నది అమ్మ రాజశేఖర్ నే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే దేవి అద్భుతంగా బిగ్ బాస్ గేము ను ఆడుతున్నట్లు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

#Social Media #Star Maa #Devi Nagavalli #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Devi Nagavalli Bold Comments Bigg Boss4 Promo Related Telugu News,Photos/Pics,Images..