రెండో పెళ్లికి రెడీ అంటున్న దేవి నాగవల్లి!

టీవీ9 యాంకర్ గా దేవి నాగవల్లి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత దేవి నాగవల్లి మరింత పాపులర్ అయింది దేవి నాగవల్లిపై మొదట్లో ప్రేక్షకుల్లో సైతం నెగిటివ్ ఒపీనియన్ ఉంది.

 Devi Nagavalli Comments About Her Second Marriage, Devi Nagavalli ,personal Life-TeluguStop.com

అయితే బిగ్ బాస్ గేమ్ ను సీరియస్ గా ఆడుతూ తనకంటూ అభిమానులను దేవి సృష్టించుకుంది.అయితే ఊహించని విధంగా మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ ను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
దేవి ఎలిమినేషన్ పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మెహబూబ్ బదులుగా దేవిని ఎలిమినేట్ చేశారని అందరూ భావిస్తున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లే సమయంలో దేవి తనకు పెళ్లైందని.భర్తతో విడిపోయానని.

తనకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పుకొచ్చింది.అయితే దేవి విడాకుల సంగతి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు.

అయితే ఎలిమినేషన్ తరువాత దేవి ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

బిగ్ బాస్ హౌస్ లో కొందరు కంటెస్టెంట్లు తనతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించారని తనకు పెళ్లై ఒక బాబు ఉన్నాడని వాళ్లకు చెప్పానని దేవి అన్నారు.

షో కోసం తన స్థాయిని తాను దిగజార్చుకోలేనని.తాను ఎక్స్ పోజింగ్ చేయనని చెప్పుకొచ్చారు.అనవసరమైన డిస్కషన్లు తనకు నచ్చవని ఆమె వెల్లడించారు.తన భర్త అమెరికాలో ఉంటారని అక్కడ తాను ఉండలేకపోయానని.

పెద్దగా గొడవలు లేకుండానే భర్తతో విడిపోయానని చెప్పారు.

తాను భ్రమల్లో, భ్రాంతిలో బ్రతకాలని అనుకోవడం లేదని తనను తనుగా ఇష్టపడి వస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని అన్నారు.

దేవి నాగవల్లి రెండో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తనకు ఒక అబ్బాయి ఉన్నాడని.

అబ్బాయిని కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె అన్నారు.మరి దేవిని ఇష్టపడే వ్యక్తి వస్తే నిజంగా పెళ్లి చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube