యాదాద్రి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి ఆలయ( Yadadri temple ) అభివృద్ధిపై దృష్టి సారించాలని,భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని,మరికొన్ని చోట్ల మూత్రశాలలు నిర్మించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ అధికారులకు సూచించారు.బుధవారం యాదాద్రి ఆలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు తాత్కాలిక షెడ్డు నిర్మాణంతో ప్రశాంతంగా ఉంటున్నారని ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.

 Development Of Yadadri Temple Should Be Focussed: Govt Whip Birla Ailaiah, Yada-TeluguStop.com

స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.డార్మెంటరీ హాల్ లో ఎక్కువమంది

పడుకునేందుకు హల్ పెంచుతున్నట్లు,అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులు భోజనం చేసేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు,వీటితో పాటు కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గూడురూ టోల్ గెట్ నుండి రాయగిరి కమాన్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని,మెట్ల మార్గంపై సోలార్ షెడ్ నిర్మాణం చేసి నీటి సౌకర్యంతో పాటు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని,ఆలయంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని,వారికి ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని, యాదాద్రిలోని పలు కూడళ్లలో స్వామివారి పేర్లతో నామకరణం చేయాలని సూచించారు.భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది స్వామి వారిని దర్శించుకుంటారని,ఎల్ఇడి స్క్రీన్స్ ద్వారా ఆలయంలో జరిగే పూజలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాటు చేసి, మీడియా పాయింట్ కూడా ఏర్పాట్లు చేయునట్లు వివరించారు.

ఈసమావేశంలో ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube