అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దేవ్‌దత్ పడిక్కల్..!

శ్రీలంక, ఇండియా మధ్య టీ20 సీరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా జరిగిన 3వ టీ20 మ్యాచ్ ఇండియా టీమ్ పరాజయం పొందింది.

 Devdat Padikkal Possesses A Rare Feat , Devadath Padikel, New Record, Male Crick-TeluguStop.com

ఇక 2వ టీ 20 మ్యాచ్ లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.ఇప్పుడు జరుగుతున్న 3 ఫార్మాట్ లలోని టిమిండియా క్రికెటర్లలో ఈ శతాబ్దానికి చెందిన ఏకైక క్రికెటర్‌గా దేవ్ దత్ పడిక్కల్ చరిత్రకెక్కాడు.

టీమిండియా టెస్టు, వన్డే, టీ20 జట్లలో ఇప్పుడుండే క్రీడాకారులంతా కూడా 1999 లేదా అంతకంటే ముందు జన్మించిన వారే.అయితే పడిక్కల్ మాత్రమే ఈ శతాబ్దంలో పుట్టి రికార్డుకెక్కాడు.

కర్ణాటకకు చెందిన ఇతడు 2000వ సంవత్సరంలో జులై 7వ తేదిన పుట్టాడు.కేవలం 21 ఏళ్లలో ఆయన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇండియా ప్లేయర్, ఆల్‌రౌండర్ అయిన కృనాల్ పాండ్యాకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో పాండ్యా బ్రదర్ తో పాటుగా మరో 8 మంది క్రీడాకారులను బీసీసీఐ ఐసోలేషన్‌ లో ఉంచింది.

Telugu Male Cricketer, Ups, Latest-Latest News - Telugu

దీంతో టీమిండియాకు కొంతమంది ఆటగాళ్లు అవసరం.శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో పడిక్కల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణాలకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ వచ్చింది.తాజాగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టీమిండియా పై విజయం సాధించడంతో 2 – 1 తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రీలంకపై టి20 లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరును నమోదు చేసి శ్రీలంకకు అతి తక్కువ టార్గెట్ ను నిర్ధారించింది.

దీంతో శ్రీలంక కేవలం మూడు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో తొలిసారిగా పడిక్కల్ సత్తా చాటాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పడిక్కల్ ప్రాతినిధ్యం వహించాడు.ఆ సీజన్‌ లో మొత్తంగా చూస్తే 15 మ్యాచ్‌ లు ఆడి 473 రన్స్ చేసి బ్యాటింగ్ లో దూకుడు తనాన్ని ప్రదర్శించాడు.

మొత్తానికి ఈ దశాబ్దంలో పుట్టిన క్రీడాకారుడిగా అతను రికార్డు నెలకొల్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube