‘దేవదాస్‌’ కలెక్షన్స్‌.. ఫైనల్‌ లెక్కలు ఇవి  

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రంకు శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వం వహించాడు. నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. కాని అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా 38 కోట్ల మేరకు బిజినెస్‌ చేసింది. సునాయాసంగా ఈ చిత్రం 40 కోట్ల వసూళ్లను సాధిస్తుంది అని అంతా నమ్మారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం నాల్గవ రోజు నుండే డ్రాప్‌ అయ్యింది.

Devdas Movie Total Collections-

Devdas Movie Total Collections

మొదటి రెండు మూడు రోజులు ఒక మోస్తరుగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తర్వాత నుండి మెల్ల మెల్లగా తగ్గింది. తాజాగా ‘నోటా’ చిత్రం రావడంతో సినిమా కలెక్షన్స్‌ పూర్తిగా తగ్గిపోయాయి మరి కొన్ని రోజుల్లో మిగిలి ఉన్న థియేటర్ల నుండి కూడా బయటకు వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం 21.8 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత మరో మూడు నాలుగు కోట్లకు మించి ఈ చిత్రం రాబట్టలేక పోతుందని సమాచారం అందుతుంది.

Devdas Movie Total Collections-

లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 25 నుండి 26 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 12 నుండి 13 కోట్ల మేరకు నష్టం తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ‘దేవదాస్‌’ ఫలితం తలకిందులు అవ్వడంతో నిర్మాతలు కూడా షాక్‌ అవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు నిర్మాతను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు.