ఒకప్పటి హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సుస్వాగతం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన ముంబై బ్యూటీ దేవయాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దేవయాని వచ్చీ రావడంతోనే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.

 Devayani, Kollywood Veteran Actress, Suswagatham, Real Life News, Tollywood-TeluguStop.com

అయితే తమిళ భాషలో మాత్రం వరుస సినీ అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించింది.

అయితే చేతి నిండా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన రాజ కుమారన్ అనే దర్శకుడి తో ప్రేమలో పడింది.

కానీ వీరి పెళ్లికి దేవయాని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో దేవయాని,   రాజ కుమారన్ తమ ఇంట్లో వారికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.కాగా ప్రస్తుతం దేవయానికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో రాజ కుమారన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు  బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పొందడంతో ప్రస్తుతం కొంతమేర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆ మధ్య పలు వార్తలు బలంగా వినిపించాయి.

అందువల్లే నటి దేవయాని తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే తెలుగులో దాదాపుగా పది సంవత్సరాల గ్యాప్ తర్వాత జనతా గ్యారేజ్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

అయితే చివరగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రంలో నటించింది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నటువంటి “లవ్ స్టోరీ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube