జనత గ్యారేజ్‌ నుండి ఆ హీరోయిన్‌ ఔట్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘జనత గ్యారేజ్‌’ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో మోహన్‌లాల్‌కు భార్య పాత్ర కోసం దేవయానిని ఎంపిక చేయడం జరిగింది.

 Devayani Out From Janatha Garage-TeluguStop.com

కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత దర్శకుడు కొరటాల శివ తృప్తి చెందలేదని, దాంతో దేవయానిని తప్పించారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.మోహన్‌ లాల్‌ మరియు దేవయానిల కాంబినేషన్‌ దర్శకుడిని మెప్పించలేక పోయిందట.

దాంతో ఆమె స్థానంలో మరో సీనియర్‌ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని కొరటాల భావిస్తున్నాడు

భారీ స్థాయిలో అంచనాలున్న ‘జనత గ్యారేజ్‌’పై ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా వదిలి పెట్టడం లేదు.

దేవయానిని తప్పించిన పాత్రలోకి ఎవరిని తీసుకుంటారా అని ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.మీనతో పాటు నదియాతో కొరటాల శివ చర్చలు జరుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే మోహన్‌లాల్‌ భార్య ఎవరు అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమంత హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube