పుష్ప ఆడిషన్స్ కి పిలిచి సుకుమార్ అలా అన్నారు.. సీరియల్ హీరో!

సుకుమార్ దర్శకత్వంలో హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా సినిమా షూటింగ్ మొదట్లో ఆడిషన్స్ కోసం సుకుమార్ మరో సీరియల్ హీరో ని కూడా పిలిచాడట.

 Devatha Serial Actor Arjun Ambati About Sundari And Pushpa Movie Sundari Movie,-TeluguStop.com

ఇక ఆ సమయంలో అక్కడ జరిగిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నాడు.ఇంతకీ అతను ఎవరో కాదు ప్రస్తుతం బుల్లితెరలో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న హీరో అర్జున్ అంబటి.

బుల్లితెరలో ఎన్నో సీరియల్ లో నటించిన ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.ఇక ప్రస్తుతం దేవత సీరియల్ లో బాగా బిజీగా ఉన్నాడు.ఇక ఈయన ప్రస్తుతం సుందరి అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అర్జున్.

Telugu Arjun, Devatha Serial, Kalayan Mandari, Pushpa, Sukumar, Sundari-Movie

తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ కెరీర్ మొదట్లో కొన్ని కష్టాలను ఎదుర్కొన్న విషయాలను తెలిపాడు.అర్ధనారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాని తెలిపాడు.ఇక సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ సుందరి సినిమా కోసం తనను అప్రోచ్ చేశాడని తెలిపాడు.

ఇక కథ విన్నాక నచ్చడంతో వెంటనే చేశానని.మొదటిసారి హీరోయిన్ పూర్ణ తో నటించినందుకు సంతోషం అని తెలిపాడు.

Telugu Arjun, Devatha Serial, Kalayan Mandari, Pushpa, Sukumar, Sundari-Movie

ఈ సినిమా పల్లెటూరులో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందని.వారు తిరిగి సిటీకి వచ్చాక జరిగిన సంభాషణ గురించి ఉంటుందని తెలిపాడు.అలా కొన్ని విషయాలు పంచుకున్న అర్జున్ పుష్ప సినిమాలో ఓ పాత్ర కోసం తనను సుకుమార్ ఆడిషన్ చేశాడట.కానీ తను సెలక్ట్ కాలేదని తెలిపాడు ఆ సమయంలో సుకుమార్ తనతో మాట్లాడుతూ.

సీరియల్, సినిమా అనేది ముఖ్యం కాదని నటన మాత్రమే ముఖ్యమని చెప్పాడంట.అంత పెద్ద డైరెక్టర్ తనకు అలా చెప్పడం ఎంతో సంతోషమని తెలిపాడు అర్జున్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube