తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి మనందరికీ తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా, ఏ ఇంట చూసినా కూడా కార్తీకదీపం సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు.
అలా ఈ సీరియల్ చూస్తుండగానే రేటింగ్ విషయంలో టాప్ నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది.సీరియల్ రేటింగ్ మాత్రం బీట్ చేయడం సాధ్యం కాదు అంటూ చేతులెత్తేశారు.
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సీరియల్ ని బీభత్సంగా అభిమానించేవారు ఉన్నారు.వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కూడా రాని రేటింగ్ బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కి వచ్చేది అంటే ఆ సీరియల్ కి ఏ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇదంతా ఒకప్పుడు.ఎందుకంటే గత కొద్ది రోజులుగా కార్తీకదీపం సీరియల్ అంటేనే ప్రజలు విసుక్కుంటున్నారు.
ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన వారే ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ అంటే బోరింగ్ సీరియల్ అంటూ తలలు పట్టుకుంటున్నారు జనాలు.ఇన్ని రోజుల పాటు డాక్టర్ బాబు, దీప ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూశారు.
కానీ వారు కలిసిన తరువాత అసలు కథ మొదలైంది.సీరియల్ దర్శకుడు కథను ఎటునుంచి ఎటు వైపు తీసుకెళ్లాలో తెలియక నడి సంద్రంలో వదిలేశాడు.
ఇకపోతే టాప్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈ సీరియల్ ని బీట్ చేస్తూ ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, దేవత సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.
ఈ మూడు సీరియల్స్ టిఆర్పి రేటింగ్ విషయంలో దూసుకుపోతూ కార్తీకదీపం సీరియల్ ని వెనక్కి నెట్టేశాయి.ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ 16-20 మధ్య టిఆర్పి రేటింగ్ ఉండగా, మిగతా సీరియల్స్ 11-14 మధ్యనే ఆగిపోయేవి.కానీ ప్రస్తుతం పరిస్థితులు ఆ విధంగా లేవు.ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 12.63 రేటింగ్ సాధించి కార్తీకదీపం సీరియల్ ని వెనక్కి నెట్టేసింది.ఒకప్పుడు 16-20 రేటింగ్ వచ్చేది.కానీ ప్రస్తుతం 13.41 మాత్రమే రేటింగ్ వస్తోంది.అయితే ఇప్పటికీ నెంబర్ వన్ సీరియల్ గా కార్తీకదీపం సీరియల్ కొనసాగుతూనే ఉంది.
కానీ టిఆర్పి రేట్ చాలా దారుణంగా వస్తుంది.ఈ సీరియల్ ని బీట్ చేస్తూ ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, దేవత సీరియల్స్ టాప్ రేటింగ్ గా దూసుకుపోతున్నాయి.
మరి ఇప్పటికైనా దర్శకుడు కథ లో మార్పులు తీసుకు వస్తాడో లేదో చూడాలి మరి.