తెలుగులో ఇటీవలే ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన టువంటి “నగ్నం” అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కాస్ట్యూమ్ డిజైనర్ దేవరపల్లి స్వీటీ అలియాస్ శ్రీ రాపాక గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే వచ్చీ రావడంతోనే తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ప్రేక్షకులను మతులు పోగొట్టినటువంటి ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలో పాల్గొంది.ఈ కార్యక్రమంలో భాగంగా తను స్థానికంగా నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉన్న ఓ పార్కులో మొక్కలు నాటింది.
అంతేగాక ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటాలని తన అభిమానులకి సూచించింది.అలాగే ఈ చాలెంజ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి విసిరింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.మామూలుగానే రామ్ గోపాల్ వర్మ సమాజాన్ని మర్చిపోయి తన ప్రపంచంలో బతుకుతుంటాడని ఇలాంటి చాలెంజ్ లు, గట్రా అతడికి పట్టవని తెగ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తారీఖున ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
అలాగే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఓ పరువు హత్య ఆధారంగా “మర్డర్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.