ఇండియన్ ఐడల్ ఫైనల్ అభ్యర్థికి సప్రైజ్ ఇచ్చిన దేవరకొండ విజయ్..!

మనం ఎంతగానో అభిమానించే హీరో మన ముందుకు వచ్చి మనల్ని పలకరించి సడెన్ సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.వాళ్ళని చూసిన ఆనందంతో అసలు మాటలు రావు కదా అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన ఇండియన్ ఐడల్ 2021 షో లో చోటు చేసుకుంది.

 Devarakonda Vijay Gives Surprise To Indian Idol Finalist Candidate  Indian, Idea-TeluguStop.com

ఈ పాపులర్ సింగింగ్ రియాలిటీ షో లో ఫైనల్ స్టేజ్‌ కు మన తెలుగమ్మాయి అయిన షణ్ముఖ ప్రియ సెలెక్ట్ అయినది.ఇంత పెద్ద రియాలిటీ షో కి మన తెలుగు అమ్మాయి సెలెక్ట్ అయ్యి ఫైనల్ కి చేరుకోవడం గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.

ఇక ఈరోజు అనగా ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో షణ్ముఖ ప్రియ పార్టిసిపేట్ చేయనుంది.

అయితే ఆమెను సర్ప్రైజ్ చేసి, ఆమెకు విషెస్ చెప్పడానికి మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీడియో మెసేజ్ ద్వారా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

షో లో చాలాసార్లు షణ్ముఖ ప్రియ విజయ్ దేవరకొండకి పెద్ద అభిమానిని అని, విజయ్ నటించబోయే సినిమాలో కనీసం ఒక్క పాట అయిన పాడాలని తన కోరిక అని షో లో ఒకసారి షణ్ముఖ ప్రియ చెప్పింది.షణ్ముఖకు షాక్ ఇవ్వడానికి సోనీ టీవీ నిర్వాహకులు విజయ్‌ ను అడిగినట్లు తెలుస్తోంది.

Telugu Ideal, Indian, Socil, Surprise, Vijay, Latest-Latest News - Telugu

అడిగిన వెంటనే విజయ్ దేవరకొండ కూడా ఓకే చెప్పి షో లో వీడియో ద్వారా కనిపించి షణ్ముక ప్రియను సర్ప్రైజ్ చేసారు.షణ్ముఖ నువ్వు టైటిల్ విన్ అయినా, అవ్వకపోయిన గాని నా తరువాత సినిమాలో నీకు పాట పాడే అవకాశం ఇస్తానని వీడియో మెసేజ్ లో తెలిపారు.ఈ వీడియోలో విజయ్ కనిపించగానే షణ్ముక ఒక్కసారిగా షాక్ అయింది.అలాగే షణ్ముఖ అమ్మానాన్నలు కూడా విజయ్ ను చూడగానే సంతోషాన్ని వ్యక్తం చేసారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విజయ్ ను చూడగానే ఒకింత షోలో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు, గెస్టులు, ప్రేక్షకులు కూడా ఆనందపడగా విజయ్ ఇచ్చిన ఆఫర్‌ ను చూసి అందరూ ఆయన్ని అభినందించడం మొదలుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube