‘దేవదాస్‌’ ఫైనల్‌ కలెక్షన్స్‌.. బాగానే రాబట్టారే  

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ భారీ అంచనాల నడుమ గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం అన్ని ఏరియాలకు కలిపి 35 కోట్లకు అమ్ముడు పోయింది. నాని, నాగార్జున కెరీర్‌లో ఇది భారీ బిజినెస్‌ అని చెప్పుకోవాలి. మల్టీస్టారర్‌ చిత్రం కనుక సునాయాసంగా 35 కోట్ల షేర్‌ను దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఏమాత్రం మెప్పించలేక మొదటి రోజే ఫ్లాప్‌ టాక్‌ ను దక్కించుకుంది.

Devadas Movie Final Collections-

Devadas Movie Final Collections

ఫ్లాప్‌ టాక్‌ కారణంగా సినిమా 35 కోట్లలో కనీసం సగం అయినా వసూళ్లు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోటీకి పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు, మల్టీస్టారర్‌ చిత్రం అనే ఆసక్తితో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరించారు. దాంతో ఈ చిత్రం 26 కోట్ల వరకు నెట్టుకు రాగలిగింది. అంటే 9 కోట్ల లాస్‌తో ఈ చిత్రం క్లోజ్‌ అయ్యింది. నిర్మాతలు ఇంతకు మించిన లాస్‌ను అనుకున్నారు. కాని అదృష్టం బాగుండి తక్కువ లాస్‌తోనే బయట పడ్డారు.

ఏరియాల వారిగా ఈ చిత్రం ఫుల్‌ రన్‌ కలెక్షన్స్‌ :
నైజాం – 7.12 కోట్లు
సీడెడ్ – 2.83 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.70 కోట్లు
ఈస్ట్ – 1.37 కోట్లు
వెస్ట్ – 1.09 కోట్లు
కృష్ణ – 1.60 కోట్లు
గుంటూరు – 1.71 కోట్లు
నెల్లూరు – 0.78 కోట్లు
టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 19.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2.80 కోట్లు
ఓవర్సీస్ – 3.72 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – రూ.25.72 కోట్లు