స్టార్ మేకర్ దేవదాస్ కనకాల మృతి! విషాదంలో చిత్ర పరిశ్రమ

నటుడు రాజీవ్ కనకాల తండ్రి, స్టార్ యాంకర్ సుమ మామ, ప్రముఖ నటుడు, స్టార్ మేకర్ దేవదాస్ కనకాల ఈ రోజు తుది శ్వాస విడిచారు.తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలకి, నటులకి నటనలో శిక్షణ ఇచ్చి ఎదగడంలో తనవంతు పాత్ర పోషించిన దేవదాస్ కనకాల నటుడుగా కూడా తనదైన ముద్ర వేసాడు.

 Devadas Kanakala No More For Us In Telugu Indusrty-TeluguStop.com

రంగస్థల నటుడుగా కెరియర్ ఆరంభించి తరువాత సినిమా వేషాల కోసం మద్రాస్ వెళ్ళిన ఆయన యాక్టింగ్ స్కూల్ పెట్టి ఎందరో నటులకి శిక్షణ ఇచ్చారు.ఈయన వద్ద ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్పగొప్ప నటులు కూడా ఉన్నారు.

రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు చాలా మంది ఆయన వద్ద నటనలో మెలుకువలు నేర్చుకొని స్టార్ నటులుగా ఎదిగారు.విశాఖలో చదువుకునే రోజుల్లోనే నాటకరంగంలో ప్రావీణ్యం సంపాదించి సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు.

తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.అయితే రెండేళ్ళ క్రితం దేవాదాస్ కనకాల భార్య కన్ను మూశారు.

ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనంతో అనారోగ్యానికి గురైన అతను హైదరాబాద్ లో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube